- Advertisement -

రోహిత్ రిటైర్మెంట్ వార్తలు..పుకార్లే!

- Advertisement -

లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌తో ఆదివారం జరగబోయే వన్డే మ్యాచ్ రోహిత్ శర్మకు చివరి అంతర్జాతీయ మ్యాచ్ కానుందనే ఊహాగానాలను బీసీసీఐ కొట్టిపారేసింది. ఈ విషయమై అలాంటి చర్చలేవీ జరగలేదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు.

రోహిత్ శర్మ భవిష్యత్తు గురించి మీడియాలో చాలా ఊహాగానాలు వస్తున్నాయి. ఆదివారం లార్డ్స్‌లో రోహిత్ తన చివరి మ్యాచ్ ఆడబోతున్నాడనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని..దీనిపై ఎలాంటి చర్చా జరగలేదని నేను గట్టిగా చెప్పాలనుకుంటున్నాను అని సైకియా మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.

రోహిత్ భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలను బీసీసీఐ కార్యదర్శి తీవ్రంగా ఖండించనప్పటికీ, భారత్ వన్డే ప్రణాళికల్లో రోహిత్ భాగమేనని స్పష్టం చేశారు.రోహిత్ భారత వన్డే జట్టులో రెగ్యులర్ సభ్యుడు. అతను జట్టు ప్రణాళికల్లో ఉన్నంత కాలం దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూనే ఉంటాడు. మరో మాటలో చెప్పాలంటే…లార్డ్స్ వన్డే అతని చివరి మ్యాచ్ కాదు అని సైకియా జోడించారు.

ప్రస్తుత ఇంగ్లాండ్ సిరీస్‌లో రోహిత్ ఫామ్ కోల్పోవడం, అలాగే భారత్ 2027 వన్డే ప్రపంచ కప్‌పై దృష్టి పెట్టడం వంటి కారణాల వల్ల అతని వన్డే భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో ఈ స్పష్టత వచ్చింది. తదుపరి ప్రపంచ కప్‌లో ఆడాలనే తన కోరికను రోహిత్ ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే కొంతకాలం క్రితం సెలెక్టర్లు, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, రోహిత్ శర్మల మధ్య అతని భవిష్యత్తుపై చర్చలు జరిగినట్లు ‘క్రిక్‌బజ్’ నివేదించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -