- Advertisement -

భార్యకు అడ్డంగా దొరికిన ఈశ్వర్ సాయి,మాధురి రాథోడ్

- Advertisement -

సోషల్ మీడియాలో జానపద పాటలతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఫోక్ ఆర్టిస్ట్ ఈశ్వర్ సాయి, మరో పాపులర్ డ్యాన్సర్ మాధురి రాథోడ్‌కు సంబంధించిన ఓ సంచలన ఉదంతం తీవ్ర చర్చనీయాంశమైంది. వేములవాడ మున్సిపల్ పరిధిలోని రెడ్డి భవన్‌లో అర్ధరాత్రి సమయంలో ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ ఒకే గదిలో ఉన్నట్లు సమాచారం తెలుసుకున్న ఈశ్వర్ సాయి భార్య శరణ్య అక్కడికి చేరుకున్నారు. వారిద్దరినీ ఒకే గదిలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఆమె, ఈ ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తెలంగాణకు చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, కంటెంట్ క్రియేటర్ మాధురి రాథోడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బంజారా సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఆమె వీడియోలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తనదైన శైలిలో బంజారా దుస్తులు ధరించి, జానపద పాటలకు రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఫుల్ పాపులర్ అయ్యారు.

తెలుగు ఫోక్ సాంగ్స్ ద్వారా మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి జోడీ చాలా ఫేమస్ అయింది. వీరిద్దరూ కలిసి చేసిన ఎన్నో జానపద పాటల వీడియోలు యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించాయి. ఆ పాటల ద్వారానే వీరికి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు వచ్చింది. స్టేజ్ షోలు, ఆల్బమ్స్‌తో ఈ జోడీ యూత్‌లో బాగా క్రేజ్ సంపాదించుకుంది.

అయితే కొద్ది రోజులుగా మాధురి రాథోడ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని వార్తలు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వ్యక్తిగత వివాదాలు, ఆరోపణల కారణంగా ఈ జోడీ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. జానపద పాటలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ జోడీ ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -