అప్పుడే పుట్టిన ఆడ శిశువు గొంతును కన్నతల్లి నులిమి చంపిందంటే నమ్మగలమా. సృష్టిలో ఏ ప్రాణి కూడా తన బిడ్డను తాను చంపుకోదు. కాని మన దురదృష్టం ఈ సంఘటన మన మధ్యే జరిగింది. ఇక వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా వికారాబాద్ లోని ఉందూరు తండాలో కవిత అప్పడే పుట్టిన ఆడ శిశువుని గొంతు నులిమి చంపింది.
ఈ ఘటనపై ఆసుపత్రి సిబ్బంది కన్నతల్లి కవితని నిలదీస్తే ఇప్పటికే రెండు సార్లు ఆడపిల్లలు జన్మించారని. మరోసారి కూడా ఆడపిల్ల జన్మించిందని అందువల్లే ఇలా చేసానని కవిత తెలిపింది. అదికాక కుటుంబంలో కూడా తనపై ఒత్తిడి అధికమైన నేపథ్యంలో ఈ ఘటనకు పాల్పడినట్లు ఆమె ఆసుపత్రి సిబ్బంది వద్ద తెలిపినట్లు సమాచారం. ఈ ఘటనపై ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఏదేమైనప్పటికి ఒక ఆడపిల్ల భూమి మీదకు రాకుండా మరో ఆడది బలిచేయడం అనేది దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని ఆశిద్దాం!
