- Advertisement -

బిగ్ బాస్ ద్వారా వచ్చిన డబ్బును జ్యోతి ఎవరికి ఇచ్చిందంటే..?

- Advertisement -

ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న టీవీ రియాలిటీ షో ‘బిగ్ బాస్’. ఈ షో నుంచి మొదటి వారంలోనే ఎలిమినేట్ అయిన నటి జ్యోతి. అయితే ఆమెకు అందిన పారితోషికంలో రూ. 50 వేలను క్యాన్సర్ తో బాధపడుతున్న నటి అల్లరి సుభాషిణికి ఇచ్చి తన మంచి మనసును చాటుకుంది. మొదటి ఒప్పుకున్న ఒప్పందం ప్రకారం.. ఎలిమినేట్ అయినప్పటిక.. అమెకు భారీ మొత్తంలోనే డబ్బు అందినట్లు తెలుస్తోంది.

అందులో కొంత మొత్తాన్ని ఓ మంచి పనికి ఖర్చు చేయాలని భావిస్తున్నానని.. ఏదైనా సలహా ఇవ్వాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు శివాజీని ఆమె కోరినట్టు తెలుస్తోంది. అల్లరి సుభాషిణికి ఇచ్చి అమెకు సహకరించాలని శివాజీ సలహా ఇవ్వగా.. ఆమె వెంటనే రూ. 50 వేలను ఆమెకు ఇచ్చింది జ్యోతి. అంతేకాకుండా పరిశ్రమలో ఇంకొంత మంది దగ్గర నుంచి కూడా సుభాషిని చికిత్స కై విరాళాలు సేకరించే ఆలోచనలో ఉందట జ్యోతి. ఏది ఏమైన జ్యోతి చేసిన మంచి పనిని అభినందించక ఉండలేం.

https://www.youtube.com/watch?v=iK8bR8KZ6x0

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -