ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ లో దిగారు. లండన్ లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో తన కూతురు చదవుకు సంబంధించి వెళ్లాల్సిన అవసరం ఉందని సీబీఐ కోర్టు నుండి అనుమతి తెచ్చుకొని.. ఆ పనులను పూర్తి చేసే పనిలో భాగంగా లండన్ చేరుకున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత సేపు నారా చంద్రబాబు పై విమర్శలు చేసే జగన్.. లండన్ లో మాత్రం ఖుషీ ఖుషీగా కనిపించారు. ఇటీవల నంద్యాల మరియు కాకినాడ ఎన్నికలలో విజయం దక్కించుకోలేని జగన్.. ఆ పరాభవం నుంచి బయటకు వచ్చేందుకు లండన్ పర్యటన బాగా ఉపయోగపడేటట్లు కనిపిస్తోంది. ఏపీ రాజకీయాలకు దూరంగా కాస్తంత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేసే విధంగా జగన్ కనపడుతున్నారు. అయన గతంలో కూడా ఇలా విదేశీ పర్యటనలు చేసిన సందర్భాలలో… గోల్ఫ్ ఆడుతూ మరియు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
ముందుగా లండన్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న వైఎస్ జగన్ కు స్థానిక వైసీపీ నేతలు మరియు కార్యకర్తల నుండి శుభాభినందనలు లభించాయి. గతంలో చంద్రబాబు విదేశీ పర్యటనలు చేసినప్పుడల్లా.. ఏపీ డబ్బంతా తీసుకుపోతున్నారని ఆరోపణలు చేసే జగన్ మరియు వైసీపీ అండ్ కోకు, తెలుగుదేశం నేతల నుండి కౌంటర్స్ రాకపోవడం విశేషం. మరి జగన్ పర్యటనపై ఎలాంటి ఆరోపణలు వస్తాయో చూడాలి.
