రాష్ట్ర విభజన జరిగి మూడున్నర్ర సంవత్సరాలు కావస్తోంది. కాని ఎక్కడా అభివృద్ధి ఛాయలు కనిపించడంలేదు. రాష్ట్రం అభివృద్ది జరగాలంటె అనుభవం ఉన్న బాబు వల్లనే అవుతుందని ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారు. కాని ఇప్పటి వరకు చంద్రబాబు చేసింది శూన్యమనె చెప్పాలి. మాయమాటలు,కల్లిబొల్లి కబుర్ల పేరుతో ప్రజలను మభ్యపెడుతూ పబ్బం గడుపుతున్నాడనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. తన అసమర్థతను ప్రజలకు తెలీయకుండా ఉండటానికి తన అస్థాన మీడియా ఉండనే ఉంది. ప్రజలనుంచి వ్యతిరేకత రాకుండా రాజధాని అభివృద్దిని ప్రతిపక్షం వైసీపీ అడ్డుకుంటోందని అరిగిపోయిన రికార్డులా చెప్తూనె ఉంటాడు బాబు.
ఇప్పటి వరకు రాజధాని అభివృద్దిపేరుతో బాబు చేసింది ఇప్పటి వరకు శూన్యం. లేదనకుండా తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీని నిర్మించారు. అదికూడా ఒక్క వాణకే కారడం మొదలు పెట్టింది. దీని వెనుక కూడా వైసీపీ హస్తం ఉందని ఆరోపించారు . తన బండారం ఎక్కడ బయట పడుతుందోనని నిద్ర లేచినప్పటినుంచి …నిద్రపోయెంత వరకు జగన్ మీద ఆరోపనలు చేయడం. బాబు అధికారంలోకి వచ్చి దాదాపు నాలుగు సంవత్సరాలు అవుతోంది. రాజధాని అభివృద్దిపేరుతో కాలయాపన చేయడం మినహా ఇప్పటి వరకు బాబు సాధించింది శూన్యమనె చెప్పాలి.
2018 కల్లా రాజధాని మొదటి నిర్మానం పూర్తి అవుతుందని గొప్పగా సెలవిచ్చారు. అమరావతి రాజధానికి పలు సార్లు శంఖుస్థాపన చేయడం శిలా ఫలకం వేయడం తర్వాత శరా మామూలె. రాజధానికి డిజైన్లు ఖరారు కాలేదని చెప్పడం. రాజధాని అమరావతికి సంబంధించి జపాన్ సంస్థ ‘మాకీ’కి మకిలి పట్టించింది సాక్షాత్తూ చంద్రబాబే. ఆ తర్వాత చాలా సంస్థలొచ్చాయి.. అవన్నీ అడ్రస్ లేకుండా పోయాయి. సింగపూర్ సంస్థలేమయ్యాయో చంద్రబాబుకే ఎరుక.
ఇప్పుడు తాజా బాధితురాలు నార్మన్ ఫోస్టర్స్ సంస్థ. ఇవన్నీ డిజైన్లు ఇవ్వడం, వాటిని చెత్త డిజైన్లుగా చంద్రబాబు తేల్చేయడం.. చెత్త డిజైన్ల కారణంగా రాజధాని అమరావతి నిర్మాణం ఆలస్యమవుతుండడం.. వెరసి, ‘తిలా పాపం తలా పిడికెడు’ అన్న చందాన, అందులో వాటా డిజైన్లు అందిస్తోన్న సంస్థల కంటే ఎక్కువ చంద్రబాబుకే దక్కుతుంది.
ఇదంతా ఎన్నికల ఎత్తుగడే విధంగా కనిపిస్తోంది చంద్రబాబు వ్యవహారం. అభివృద్ధి పేరుతో గుంతలు తీయడం …రాజధాని పేరుతో నాటకాలాడటం. అందుకు తాజా ఉదాహరనె నంద్యాల ఉప ఎన్నిక. నంద్యాల వైపు కన్నెత్తి చూడని చంద్రబాబు అభివృద్ధి పేరుతో హడావుడిగా ఎక్కడి కక్కడ గుంతలు తవ్వి పనులుమొదలు పెట్టారు. వీటిని పూర్తి చేయాలంటె టీడీపీకె ఓటవేయాలని ప్రజలను బ్లాక్ మేల్ చేయడం.
ఇప్పుడు కూడా ఎన్నికల కోసం రాజధాని అభివృద్ధి పేరుతో నాటకాలాడుతున్నారనె వార్తలు వినిపిస్తున్నాయి . రాజధాని నిర్మానానికి సంబంధించి అనేక డిజైన్లను కంపెనీలు అందించాయి. కాని ఇప్పటి వరకు ఫైనల్ కాలేదు. డిజైన్లు ఖరారు చేసి పనులు మొదలు పెట్టే సమయానికి ఎన్నికలు వస్తాయి. అంతె మరో సారి రాజధానికి గుంతలు తీయడం…రాజధాని నిర్మానాలు పూర్తి అవ్వాలంటె నాకే ఓటు వేయండని మరో సారి ప్రలజను బ్లాక్ మేయిల్ చేయడం…మళ్లీ అధికారంలోకి రావాలనుకోవడం తప్ప రాజధానిని అభివృద్ధి చేయాలనె చిత్తశుద్ధి మాత్రం కనిపించడంలేదు. బాబు మాటలలో ఉన్న శ్రధ్ద చేతలలో చూపడంలేదు.
అందరూ మెచ్చే రాజధానిని నిర్మించు కోవాలని అందరూ అనుకుంటారు. కాని ఇప్పటి వరకు అమరావతి రాజధానికి సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకోలేదు. డిజైన్ల పేరుతో ప్రజలను మభ్య పెట్టడం తప్ప. రాజధాని డిజైన్లు ఖరారయ్యి పనులు మొదలు పెట్టేలోపు ఎన్నికల హడావుడి మొదలవుతుంది. అప్పుడు ఎన్నికలమీద దృష్టి తప్ప వేరేదానిమీద ఉండదు. రాజధానికి శంఖుస్థాపనలు చేసి పునాదులు వేశాం అవిపూర్తి కావాలంటె మరో సారి అధికారాన్ని ఇవ్వాలని బాబు ప్రజలను బ్లాక్ మేయిల్ చేయడం ఇది తప్ప వేరేది ఉండదనేది విశ్లేషకులు భావన.
