ప్రపంచంలో టెక్నాలజీ బధ్రత పెరిగినా సైబర్ దాడులు ఆగడంలేదు. ఇప్పటికే అనేక దేశాలకు చెందన ముఖ్యమైన వెబ్సటై్లు హ్యాకర్ల బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా హ్యాకర్లు మరో సారి సీక్లీనర్ సాఫ్ట్వేర్ పై సైబర్ దాడి చేశారు.
కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లలో జంక్ ఫైళ్లను, బ్రౌజర్ హిస్టరీలను, క్యాషే ఫైళ్లను, కుకీలను డిలీట్ చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది సీక్లీనర్ సాఫ్ట్వేర్ ను ఉపయేగిస్తున్నారు. తాజాగా ఈ సాఫ్ట్ వేర్ హ్యాకర్ల దాడికి గురైంది. గత ఆగస్టులో విడుదల చేసిన వెర్షన్ 5.33.6162, సీక్లీనర్ క్లౌడ్ వెర్షన్ 1.07.3191 సాఫ్ట్వేర్ల మీద హ్యాకర్లు దాడి చేసినట్లు సీక్లీనర్ మాతృ సంస్థ పిరిఫార్మ్ ప్రకటించింది.
ప్రస్తుతం సీక్లీనర్ అప్డేట్లను పర్యవేక్షిస్తున్న అవాస్ట్ కంపెనీ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఈ రెండు వెర్షన్లను ఇప్పటికి 2.27 మిలియన్ల మంది డౌన్లోడ్ చేసుకున్నట్లు ప్రకటించింది. అయితే హ్యాక్‌కి గురైందన్న సంగతి తెలిసిన వెంటనే అప్డేట్ను ఆపేసినట్లు అవాస్ట్ తెలిపింది. అలాగే కొత్త వెర్షన్‌ను కూడా డౌన్‌లోడ్‌కి సిద్ధంగా ఉంచినట్లు కంపెనీ తెలిపింది.
ప్రస్తుతం వినియోగదారులందరూ పాత సీక్లీనర్ వెర్షన్‌ని డిలీట్ చేసి, కొత్తది ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించింది. అయితే హ్యాక్ గురైన వెర్షన్ల వల్ల ప్రమాదం ఎదురైనట్లు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని పేర్కొంది. హ్యాకర్లు కేవలం వినియోగదారుల వివరాలు మాత్రమే సేకరించి ఉంటారని వారు చెబుతున్నారు.
