ఏదైనా చంద్రబాబు గ్రేట్. ది గ్రేటెస్ట్ అని కూడా అనాలేమో. పిల్లనిచ్చిన ఎన్టీఆర్ నుంచి పదవిని, పార్టీని లాక్కుని వెన్నుపోటు పొడిచిన తర్వాత కూడా అదే ఎన్టీఆర్ పేరు చెప్పుకుని ఆయన అభిమానుల ఓట్లు ఈ రోజుకీ కొల్లగొడుతున్నాడు. అదే ఎన్టీఆర్ కొడుకులను తన భజన సేనగా మార్చుకున్నాడు. ప్రజల విషయంలో కూడా చంద్రబాబుది అదే థియరీ. 2004ఎన్నికల్లో వైఎస్ ఉచిత విద్యుత్ అంటే బాబు ఎద్దేవా చేశాడు. విద్యుత్ తీగలపై బట్టలారేసుకోవాలన్నాడు. కట్ చేస్తే అదే ఉచిత విద్యుత్‌కి ఓట్లు రాలుతున్నాయని 2014లో తాను కూడా ఉచిత విద్యుత్ అనేశాడు.
ఇక ప్రత్యేక హోదా గొప్పది అని 2014ఎన్నికల ముందు అన్నాడు. అధికారం దక్కాక ప్యాకేజ్ నిధులు వస్తే తనకు, తనవాళ్ళకు ఉపయోగపడతాయని ప్యాకేజ్ కావాలని మోడీని అడిగాడు. కట్ చేస్తే ఇప్పుడు ప్రజాగ్రహాన్ని చూసి మెల్లగా హోదా వైపు టర్న్ తీసుకుంటున్నాడు.
ఆ విషయం పక్కనపెడితే జగన్ రాజీనామాలు, అవిశ్వాస తీర్మానం దెబ్బకు చంద్రబాబుపై ఒత్తిడి పెరిగింది. పోరాటం అని భజన మీడియాలో రాయించుకోవడం తప్పితే బాబు ఇప్పటి వరకూ మోడీకి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడింది కానీ చేసింది కానీ ఏమీ లేదు. అందుకే సీమాంధ్రులంతా జగన్‌వైపు టర్న్ అవుతూ ఉండడంతో మోడీకి వ్యతిరేకంగా తానూ ఏదో ఒకటి చేస్తున్నాను అని చెప్పుకోవడానికి బాబు సూపర్ స్కెచ్ వేశాడు. మోడీకి లాభం చేయాలి….కానీ అది పోరాటం అని ప్రజలను నమ్మించాలనుకుంటున్నాడు. అదేంటంటే జపాన్ కార్మికుల తరహాలో ఆంధ్రప్రదేశ్ జనాలు ఎక్కువ పనిగంటలు పనిచేయాలట. ఆ రకంగా పోరాటం చేయాలట. ఇది జపాన్ మోడల్ నిరసన అని బాబు గొప్పగా చెప్పాడు. కాకపోతే బాబు ఇక్కడ ఒక నిజం మాత్రం దాచేశాడు. నిజానికి జపాన్‌లో కార్మికులు ఎక్కువ పనిచేస్తే ప్రొడక్షన్ పెరిగి స్టాక్ మిగిలిపోయి కంపెనీలు నష్టపోతాయి. అందుకే అలా చేసి నిరసన తెలిపి యాజమాన్యాన్ని దారికి తెచ్చుకుంటారు. ఇక్కడ సీమాంధ్రులు ఇంకా ఎక్కువ పనిచేస్తే ఏమవుతుంది? జీఎస్టీ పుణ్యమాని కేంద్రం లాభపడుతుంది. ఎలాగూ తిరిగి ఇచ్చేవి బిచ్చమేసినట్టుగా ఉంటున్నాయిగా. మరి ఈ నిరసనతో మోడీ ఎలా దిగొస్తాడన్నట్టు? ఇది మోడీకి లాభం చేసేది కదా…….అంటారా……..ఆ విషయం బాబుకు కూడా తెలుసు. బాబు స్టైల్ అదే కదా…….వెన్నుపోటు పొడుస్తూ కూడా ……ఇదే మంచిది అని నమ్మించగలడు. ఆ రకంగా మోడీకి మంచి చేస్తూ దాన్ని పోరాటం అని ఆంధ్రప్రదేశ్ ప్రజలను నమ్మించి…….మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేశాను కాబట్టి 2019ఎన్నికల్లో తనకు ఓట్లేయాలని చెప్తాడన్నమాట.
ఏది ఏమైనా చంద్రబాబు రాజకీయ కుట్రలు, వ్యూహాలు మాత్రం దిమ్మతిరిగేస్థాయిలో ఉంటాయి. మరి ఆ వ్యూహాలకు 2019లో కూడా సీమాంధ్ర ఓటర్లు ఓట్లేస్తారా?