- Advertisement -

చంద్ర‌బాబుని ఏమ‌ని పిల‌వాలి:సావిత్రి కూతురు

- Advertisement -

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడిని ఏమ‌ని పిల‌వ‌లో అర్థం కావ‌డం లేద‌ని అంటున్నారు సావిత్రి కుతురు విజయ ఛాముండేశ్వరి .’మహానటి’ సినిమా సక్సెస్ కావడంతో సినిమా యూనిట్‌ను విజ‌య‌వాడ‌కి పిలిపించి మ‌రి ప్రత్యేకంగా సన్మానించారు చంద్ర‌బాబు.ఈ సందర్భంగా సావిత్రి కూతురు విజయ ఛాముండేశ్వరి మాట్లాడుతూ..”చంద్రబాబు నాయుడు గారిని సీఎం అని పిలవాలా లేక బావ గారు అని అనాలా అనే విషయం నాకు తెలియడం లేదు. నారా భువనేశ్వరిని నేను అక్కా అని పిలిచేదాన్ని. ఈ రోజు ఆయన అమ్మ చరిత్రతో తీసిన సినిమాను ఘనంగా సన్మానించడం సంతోషంగా ఉంది.

అమ్మ పుట్టిన ఊరిలో ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉంది. ఇక అమ్మ పాత్ర‌లో కీర్తి చాల బాగా న‌టించింది. సావిత్రి జీవిత క‌థ ఆధారంగా మ‌హ‌న‌టి సినిమాను తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే.సినిమా ఘ‌న విజ‌యం సాధించండంతో సినిమా యూనిట్‌ను నారా చంద్రబాబు నాయుడు సన్మానించారు.ఈ కార్య‌క్ర‌మంలో హీరోయిన్ కీర్తి సురేష్‌తో పాటు సినిమా ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్‌,చిత్ర నిర్మాతలు, సావిత్రి కూతురు విజయ ఛాముండేశ్వరి పోల్గొన్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -