- Advertisement -

చంద్రబాబు రోజుకొక డ్రామా , రోజుకొక మాట !

- Advertisement -

కేంద్ర బడ్జెట్ లో కేంద్రం ఏపీ కి తీరని అన్యాయం జరిగింది అని చిన్న పిల్లోడిని అడిగినా కూడా చెబుతాడు. అంతెందుకు నిన్న జరిగిన పాలిట్ బ్యూరో సమావేశం లో ఏపీ కి కేంద్రం ఊహించని నష్టం ఇచ్చింది అని వాపోయిన చంద్రబాబు నాయుడు స్వయంగా ఇప్పుడు కొత్త కహానీ వినిపిస్తున్నారు.

కేంద్ర బడ్జెట్ లో ఏపీ కి అన్యాయం జరగలేదు అంటున్నారు ఆయన. ఈ విషయం మీద కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ తో తాను మాట్లాడాను అనీ రాష్ట్రాల వారీగా కాకుండా రంగాల వారీగా కేటాయింపులు జరిగాయి అని జైట్లీ చంద్రబాబు కి చెప్పారట. దాంతో పెండింగ్ ప్రాజెక్టుల విషయమై త్వరలో నే అంటే ఈ ఏడాది చివ్వర లోగా స్పష్టమైన హామీ ఇస్తాం అని జైట్లీ చెప్పడం తో బాబు ఓకే అన్నారట. 

మళ్ళీ బాబు కొత్త పాట అందుకున్నారు. ప్రత్యేక హోదా సాధిస్తామనే నమ్మకం వుందని చంద్రబాబు సెలవిచ్చారు. ప్రత్యేక ప్యాకేజీ కూడా వస్తుందట. రైల్వే జోన్‌సాధిస్తామనే నమ్మకం కూడా చంద్రబాబుకి వుందట. ఆంధ్రప్రదేశ్‌ఆర్థిక పరిస్థితిని అరుణ్‌జైట్లీ దృష్టికి తీసుకు వెళితే, తనకు అన్నీ తెలుసని ఆయన చంద్రబాబుకి సమాధానమిచ్చారట. సింపుల్‌గా చెప్పాలంటే, ఆంధ్రప్రదేశ్‌కి కేంద్ర బడ్జెట్‌లో న్యాయం చెయ్యకపోయినా, చంద్రబాబు సంతృప్తితోనే వున్నారు. అది కూడా నిన్న అసంతృప్తి రాగం అందుకున్న ఆయన ఇప్పుడు మళ్ళీ సంతృప్తి రాగం అందుకున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -