- Advertisement -

ఛ‌త్తీస్‌గ‌డ్‌లో భారీ ఎన్‌కౌంట‌ర్‌…14 మంది మృతి

- Advertisement -

చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. కుంట సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌‌లో 14 మంది పైగా నక్సల్స్ హతమయ్యారు.

సుక్మా జిల్లా కుంట పోలీసు స్టేషన్ పరిధి కన్నాయి గూడ అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో నక్సల్స్ నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

గొల్లపల్లి, కన్నాయి గూడ అటవీ ప్రాంతంలో కూంబింగ్ కు వెళ్లిన జవాన్లకు మావోయిస్టులు తారసపడ్డ వేళ ఈ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. తమకు లొంగిపోవాలని జవాన్లు హెచ్చరించినా, వినకుండా మావోలు కాల్పులు ప్రారంభించడంతో ప్రాణ రక్షణకు జవాన్లు కూడా ఫైరింగ్ జరిపారు.

ఎన్ కౌంటర్ ను ధ్రువీకరించిన స్థానిక పోలీసు అధికారులు, కొందరు జవాన్లకు కూడా గాయాలు అయ్యాయని, వారిని ఆసుపత్రులకు తరలించామని తెలిపారు. మృతిచెందిన మావోయిస్టుల సంఖ్యపై అధికారిక ప్రకటన తరువాత వెల్లడిస్తామని, ప్రస్తుతం వారిని గుర్తించే పనిలో ఉన్నామని అన్నారు.

గొల్లపల్లి ప్రాంతంలో నక్సల్స్ కోసం భద్రతా బలగాలు ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. నక్సల్స్ కోసం ఇంకా కూంబింగ్ కొనసాగుతోందని కుంట ఎస్పీ ప్రకటించారు. కొద్ది రోజుల నుంచి పరిస్థితులు సాధారణంగానే కనిపించినా మళ్లీ తాజాగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -