- Advertisement -

సిరిసిల్ల జిల్లా బైపాస్ రోడ్డులో ఘోర రోడ్డు ప్ర‌మాదం..

- Advertisement -

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బైపాస్‌రోడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కారును కంటైనర్ ఢీకొట్ట‌డంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా..మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాల‌య్యిన మ‌హిళ‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

మృతులు కరీంనగర్‌కు చెందినవారిగా గుర్తించారు. కరీంనగర్ నుండి బయలుదేరిన కుటుంబం వేములవాడ రాజా రాజేశ్వర స్వామీ దర్శనం అనంతరం సిద్ధిపేట బయలుదేరింది. వీరు ప్రయాణిస్తున్న కారును బైపాస్ రోడ్డులో లారీ ఢీకొట్టింది. మృతి చెందిన వారు అనిల్ కుమార్ , సూరజ్ , సృజన్‌గా గుర్తించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులుగా అనుమానిస్తున్నారు. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -