ఓటుకు కోట్లు కేసు తలకు చుట్టుకుని ఇప్పటికే నానా రకాల భయాలు, ఆందోళనలతో వణికిపోతున్న నారావారి మెడకు ఇప్పుడు తెలంగాణా ఎన్నికల పుణ్యమాని మరో ఓటుకు కోట్లు కేసు చుట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ఇంటెలిజెన్స్‌నే ధృవీకరిస్తోంది. తెలంగాణా ఎన్నికల్లో వరంగల్‌కి తరలిస్తూ పట్టుబడిన 5.8 కోట్ల రూపాయల వ్యవహారంలో చంద్రబాబుకు సంబంధం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.
సింగపూర్ నుంచి హవాలా రూపంలో వచ్చిన ఈ డబ్బు కీర్తి కుమార్ జైన్ అనే వ్యాపారి ద్వారా పంపకాలు చేస్తున్న సమయంలో పట్టుబడింది. ఈ డబ్బును నామా నాగేశ్వరరావు, కొండా మురళి, రవిచంద్రలకు చేర్చేందుకు వెళ్తున్నట్టు హవాలా బ్రోకర్ కీర్తికుమార్ పోలీసులకు చెప్పేశాడు. ఈ డబ్బు వస్తున్న విషయం నామా నాగేశ్వరరావుకు ముందే తెలుసు అన్న విషయం పోలీసుల విచారణలో బయటపడింది. సిఎం రమేష్, సుజనా చౌదరిల్లాగే నామా నాగేశ్వరరావు కూడా చంద్రబాబుకు అంతరంగికుడు, టిడిపికి ఆర్థిక సాయం చేసే ఒక బినామీ అన్న విషయం చాలా సార్లు నిరూపణ అయింది. ఇప్పుడు పోలీసులు ఆ కోణంలో విచారణ చేస్తే సింగపూర్ హవాలా లింక్ బయటపడింది. దాంతో ఈ మొత్తం వ్యవహారం ఎక్కడ చంద్రబాబు మెడకు చుట్టుకుంటుందో అన్న టెన్షన్ టిడిపి నేతల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికీ ఒక ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కుని అవినీతిపరుడు, అక్రమవ్యవహారాల నాయకుడు అని పేరు తెచ్చుకున్న చంద్రబాబు పూర్తిగా హైదరాబాద్ నుంచి బిచాణా ఎత్తేయాల్సి వచ్చింది. ఇప్పుడిక ఈ రెండో ఓటుకు కోట్లు కేసు దెబ్బకు పరిణామాలు ఇంకెంత భయంకరంగా ఉంటాయో అన్న టెన్షన్ టిడిపి నేతల్లో వ్యక్తమవుతోంది.
- బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ విజయం..
- విశాఖ – బెంగళూరు వందేభారత్ స్లీపర్‌కు గ్రీన్ సిగ్నల్, రూట్ ఇలా..
- అరుణాచలం వచ్చే భక్తులకు కొత్త నిబంధనలు.. మోక్ష మార్గంలో వారికే అనుమతి..
- ఇక్కడకు రావద్దు.. విజయ్ కు డీకే శివకుమార్ విజ్ఞప్తి.. ‘జననాయగన్’ నిలిపివేత
- కోర్టుకు హాజరైన కేటీఆర్..ఛార్జ్ షీట్ లో కీలక అంశాలు
- జగన్ రాకతో పోటెత్తిన ఉత్తరాంధ్ర.. ఆంక్షలు చేధించి
