తెలుగు దర్శకులలో టాప్ డైరెక్టర్ ఎవరంటే అందరు ఒకే పేరు చెబుతారు…ఆ పేరే రాజమౌళి. దర్శకుడు ధీరుడుగా పేరుగాంచిన రాజమౌళి తీసిన ప్రతి సినిమా హిట్టే. ప్రభాస్‌తో తీసిన బాహుబలి సినిమా అయితే నేషనల్ లేవల్లో ఆయనకు క్రేజ్ తీసుకువచ్చింది. బాహుబలి సినిమా తరువాత రాజమౌళి అంటే ఓ బ్రాండ్లా ఏర్పడింది. ఇక మీద రాజమౌళి తీయబోయో సినిమాలకు నేషనల్లో లేవల్లో బిజినెస్ జరగుతుందనడంతో ఎటువంటి అనుమానం లేదు. తాజాగా రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ చరణ్‌తో భారీ మల్టీస్టారర్‌కు తీస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలుపెట్టాడు రాజమౌళి. సినిమా షూటింగ్ అయితే మొదలుపెట్టాడు కాని , సినిమాలో హీరోయిన్లను ఇప్పటి వరకు ఫైనల్ చేయలేదు రాజమౌళి. పలువరు హీరోయిన్లు పేర్లు వినిపిస్తున్నప్పటికి వీరిలో ఇద్దరి పేర్లే ఎక్కువుగా వినిపిస్తున్నాయి. కీర్తి సురేష్,పూజా హెగ్డెలు ఈ మల్టీస్టారర్‌లో ఫైనల్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. హీరోయిన్ల విషయంలో అచితుచి అడుగులేస్తున్నాడు రాజమౌళి. హీరోయిన్ల పేర్లను సంక్రాంతికి అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం. ఇక సినిమాను 2019 చివరికి కాని 2020 సంక్రాంతికి విడుదల చేయనున్నారు.
- ఆక్వా రైతులతో జగన్..సర్కార్‌కు డెడ్‌లైన్
- భార్య,పిల్లలతో పార్టీ ఆఫీస్ ముందు టీడీపీ నేత ధర్నా
- ‘పెద్ది’లో అదిరిపోయే ఐటమ్ సాంగ్ వచ్చేసింది!
- AP SIR:మాజీ డిప్యూటీ సీఎం ఓటు మిస్సింగ్
- గొర్రెల కాపారులపై కులం పేరుతో దాడి
