టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెంతున్నా పరువు హత్యలు ఆగడంలేదు. పరువు కోసం తల్లి,దండ్రులు సొంత బిడ్డలు అని చూడకుండా కిరాతకంగా హతమారుస్తున్నారు. తమ అభిమతానికి వ్యతిరేకంగా కలాంతర వివాహాలు చేసుకుంటుండంతో కనికరం లేకుండా కన్న బిడ్డల చంపుకుంటున్నారు. తాజాగా తెలంగాణాలో మరో పరువు హత్య చోటు చేసుకుంది. నందకిషోర్ అనే వ్యక్తిని భార్య తరపు బంధువులు శనివారం అర్ధరాత్రి దారుణంగా కొట్టి చంపారు.
వివరాల్లోకి వెల్తే…నాలుగేళ్ల క్రితం తిరిమలగిరిలోని టీచర్స్ కాలనీకి చెందిన ఓ యువతిని నందకిషోర్ ప్రేమ వివాహం చేసుకున్నారు. అమ్మాయి తల్లి,దండ్రులకు ఇ వివాహం ఇష్టం లేకపోవడంతో నందకిషోర్‌ను చంపేదానికి ప్లాన్ వేశారు. నందకిశోర్ ను వదిలి వచ్చేయాలనీ, మళ్లీ వివాహం చేస్తామని అశ్వినికి ఆమె తల్లిదండ్రులు ఫోన్ లో చెప్పేవారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి.
దీంతో బాబును తీసుకుని అశ్విని పుట్టింటికి వచ్చేసింది. దీంతో పంచాయితీ కోసమని నందకిషోర్‌ను ఇంటికి పిలిపించారు. అల్లుడికి పూటుగా మద్యం తాగించిన బావమరది మహేశ్వర్… అనంతరం పక్కా ప్రణాళికతో అతని తలపై బండరాయితో మోది హత్యచేశారు. సమాచారమందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసునమోదు చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.
- దళిత స్పీకర్ దూషణ, ఎర్రవల్లి ఘటనలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం!
- NZ VS INS: హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న మ్యాచ్ టికెట్లు!
- అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత.. బీఆర్ఎస్ సభ్యులంతా సస్పెండ్!
- యువతపై కేసులా? చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం!
- బిగ్‌బాష్ లీగ్ పై ఐపీఎల్ ఓనర్ల కన్ను!
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై చర్యలకు రంగం సిద్ధం!
