హీరో మంచు మనోజ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికి తెలిసిందే. ఎప్పటికప్పుడు జరిగే పరిణమాలపై తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తుంటాడు మనోజ్. తాజాగా మరోసారి తన ట్విట్టర్‌కు పని చెప్పాడు మనోజ్. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ని ఉద్దేశిస్తూ మనోజ్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఓ ఛానెల్‌కు ఇంటర్య్వూకు వచ్చిన కేఏ పాల్ అక్కడ ఓ పాట పాడారు. ఇది కొంచెం పొలిటికల్ సంబంధించింది కావడంతో ఈ పాట బాగానే వైరల్‌గా మారింది. ఈ
పాటపై స్పందించిన మనోజ్…ఆ పాట రావడం లేదని కామెంట్ పెట్టాడు. ”సార్ ఎపిక్ వీడియో. నేను ఆ పాటను ప్రాక్టీస్ చేస్తున్నాను కానీ కేఏ పాల్ పాడినట్లుగా నేను పాడలేకపోతున్నాను” అంటూ సోషల్ మీడియాలో కామెంట్ పెట్టారు. ఈ పాటపై వివాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా స్పందించారు. తన ట్విట్టర్లో నవ్వుతున్న ఎమోజీలను పెట్టి వీడియోను పోస్ట్ చేశారు వర్మ. ఇది చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. మంచు మనోజ్ ప్రస్తుతం సినిమాలు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.
- అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత.. బీఆర్ఎస్ సభ్యులంతా సస్పెండ్!
- యువతపై కేసులా? చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం!
- బిగ్‌బాష్ లీగ్ పై ఐపీఎల్ ఓనర్ల కన్ను!
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై చర్యలకు రంగం సిద్ధం!
- భార్యను హతమార్చి, తలను ఫ్రిడ్జ్‌లో పెట్టి..
