- Advertisement -

కేరళ స్టార్స్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్ దందా

- Advertisement -

కేరళ సినీ రంగం మరియు సోషల్ మీడియా ప్రపంచాన్ని డ్రగ్స్ దందా కుదిపేస్తోంది. కొచ్చి కేంద్రంగా సాగుతున్న భారీ డ్రగ్ నెట్‌వర్క్‌ను పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ రిన్సీ ముంతాజ్ అరెస్ట్ కావడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.

స్టార్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా కొనసాగుతూనే రహస్యంగా డ్రగ్స్ దందా నడిపిస్తున్న రిన్సీ ముంతాజ్‌ను పోలీసులు పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి సుమారు 3 కిలోల MDMA డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. విశేషమేమిటంటే, రిన్సీ డ్రగ్స్ కేసులో పట్టుబడటం ఇది రెండోసారి. ఆమెతో పాటు ఆమెకు సహకరిస్తున్న పలువురు అనుచరులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసుల విచారణలో ఈ డ్రగ్ మాఫియా అనుసరిస్తున్న విస్తుపోయే పద్ధతులు వెలుగులోకి వచ్చాయి.కస్టమర్లను పట్టడానికి వీరు కేవలం సోషల్ మీడియానే కాకుండా డేటింగ్ యాప్స్ను కూడా వేదికగా చేసుకున్నారు..పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు గూగుల్ పే (Google Pay) మరియు క్రిప్టో కరెన్సీ (Crypto) ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహించేవారు..ఈ మాఫియాకు ఐటీ ఉద్యోగులు, ప్రముఖ బిజినెస్ మెన్లు ప్రధాన కస్టమర్లుగా ఉన్నట్లు సమాచారం.

ఈ కేసు దర్యాప్తులో మలయాళ సినీ రంగానికి (Mollywood) సంబంధించిన లింకులు బయటపడటం సంచలనంగా మారింది. లగ్జరీ హోటళ్లు, ప్రైవేట్ బోట్లలో నిర్వహించే హై-ప్రొఫైల్ డ్రగ్ పార్టీలకు ఈ డ్రగ్స్ సరఫరా అయ్యేవని పోలీసులు గుర్తించారు. పలువురు సినీ ప్రముఖులకు ఈ ముఠాతో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

రిన్సీ ముంతాజ్ పట్టుబడటంతో పోలీసులు ఆమె కాల్ డేటా (Call Data) పై దృష్టి సారించారు. ఆమె ఫోన్ రికార్డులను విశ్లేషిస్తే ఈ మాఫియా వెనుక ఉన్న అసలైన కింగ్ పిన్లు, రాజకీయ మరియు సినీ రంగానికి చెందిన పెద్ద తలకాయల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం కేరళ పోలీసులు ఈ నెట్‌వర్క్‌ను పూర్తిగా తుడిచిపెట్టేందుకు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.

సోషల్ మీడియా క్రేజ్‌ను అడ్డుపెట్టుకుని డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న రిన్సీ ముంతాజ్ అరెస్ట్, కొచ్చిలో డ్రగ్స్ సంస్కృతి ఎంతలా పాతుకుపోయిందో మరోసారి నిరూపించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -