- Advertisement -

ఒక సెల్ఫీ …ముగ్గురి ప్రాణాల‌ను బ‌లిగొంది..

- Advertisement -

సెల్ పోన్‌లు చేతిలో ఉంటె ఊరికే ఉంటారా కుర్రాల్లు. ఇంకేముంది ట‌క్ మ‌ని సెల్ఫీ దిగి సామాజిక మాధ్య‌మాల్లో పోస్ట్ చేస్తుంటారు. ఒక్కో సారి అదే సెల్ఫీ వారి ప్రాణాల‌ను కూడా తీస్తుంది. సెల్ఫీలతో ప్రమాదాలు ముంచుకొస్తున్నా.. ప్రాణాలు పోతున్నా.. యువత ఏ మాత్రం పట్టించుకోవట్లేదు. యువతను సెల్ఫీల పిచ్చి పట్టిపీడిస్తోంది. ఇప్పటికే సెల్ఫీల మోజులో పడి పలువురు యువత ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇలాంటి సంఘ‌ట‌న‌లు గ‌తంలో అనేకం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. తాజాగా అలాంటి ఘ‌ట‌నే చోటు చేసుకుంది. సెల్ఫీ తీసుకుంటూ ముగ్గురు యువ‌కులు మ్య‌త్యువాత ప‌డ్డారు. ఈ సంఘ‌ట‌న హ‌ర్యానాలో చోటు చేసుకుంది.

ముగ్గ‌రు యువ‌కులు రైలు ప‌ట్టాల‌పై సెల్ఫీ తీసుకుంటూ మృత్యువాత ప‌డ్డారు. పానిపట్‌కు పెళ్లికొచ్చిన ఓ నలుగురు యువకులు స్థానికంగా ఉన్న రైలు పట్టాలపైకి వచ్చారు. రైలు వస్తుండగా సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించారు. అంతలోనే రైలు దూసుకురావడంతో తమ ప్రాణాలను కాపాడుకునేందుకు మరో ట్రాక్‌పైకి దూకేశారు. అటు నుంచి కూడా వేగంగా రైలు దూసుకురావడంతో నలుగురిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఒక‌రు గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు.ముగ్గురు యువకులు రోజూవారీ కూలీలుగా పనిచేస్తున్నారు

మృతుల్లో ఇద్దరి వయసు 19 ఏండ్లు కాగా, మరొకరి వయసు 18 సంవత్సరాలు. ప్రపంచ వ్యాప్తంగా 2011 -17 మధ్య కాలంలో సెల్ఫీలు దిగుతూ 259 మంది మృతి చెందినట్లు తేలింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -