తమిళ నటులు శరత్ కుమార్, రాధారవిలకు మద్రాస్ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. వారిద్దరిని అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేయడం ఇప్పుడు తమిళవర్గాల్లో సంచలనంగా మారింది.గతంలో సినీ నటుల సంఘానికి అధ్యక్షుడిగా శరత్ కుమార్, కార్యదర్శిగా రాధారవిలు పని చేసిన సమయంలో సినీ నటుల సంఘానికి చెందిన భూ అక్రమ విక్రయాల ఆరోపణలపై ప్రాధమిక సాక్ష్యాలను పోలీసులు కోర్టుకు అందించడంతో న్యాయమూర్తి, వారిని అరెస్ట్ చేయాలని ఆదేశించారు
కాంచీపురం జిల్లా వెంకటామంగళంలో ఉన్న సినీ నటుల సంఘానికి చెందిన స్థలాన్ని అక్రమంగా విక్రయించారని 2017లో ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, దాన్ని విచారణను పోలీసులకు బదిలీ చేసిన కోర్టు, 3 నెలల్లో స్థల విక్రయం కేసును తేల్చాలని ఆదేశించింది. కేసు విచారణ క్రమంలో శరత్ కుమార్, రాధారవిలకు వ్యతిరేకంగా సాక్ష్యాలు లభించడంతో వారిని అరెస్ట్ చేయాలని ధర్మాసనం ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశాలపై వీరెవరూ ఇంత వరకు స్పందించలేదు.
