ముంబై అండర్ వరల్డ్ పేరు చెప్తే మనకి ముందు గుర్తొచ్చే వ్యక్తి దావూద్ ఇబ్రహీం. ఇండియన్ ఇంటలిజెన్స్ ఇతన్ని ఎన్నో సంవత్సరాలు గా పట్టుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తోంది. దావూద్ త్వరలో ముంబై రానున్నాడు అని వార్తలు షికారు చేస్తున్నాయి. పాకిస్తాన్ లో ఎప్పటి నుంచో దాక్కొని ఉన్న దావూద్ ని పట్టుకోవడం కోసం మనవాళ్ళు చేసిన ప్రయత్నాలు ఎప్పటికప్పుడు విఫలం అవుతున్నాయి.
సో ముంబై లో అతని చుట్టం పెళ్లి సందర్భంగా రాబోతున్న దావూద్ ని పట్టుకోవడం కోసం పోలీసులు, మట్టు బెట్టడం కోసం అతని శత్రువులు చూస్తున్నారు . దావూద్ సోదరి హసీనా పార్కర్ చిన్నకుమారుడైన అలీషాహ్ పార్కర్ కు బుధవారం పెళ్లి. హసీనాకు ముగ్గురు పిల్లలు కాగా… పెద్ద కొడుకు 2006లోనే యాక్సిడెంట్ లో చనిపోయాడు. కూతురికి గతేడాదే పెళ్లి చేశారు. ఇప్పుడు చిన్న కొడుక్కి ఘనంగా పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేశారు.
వివాహం బుధవారం ఉదయం రసూల్ మసీదులో రిసెప్షన్ జుహులోని తులిప్ స్టార్ హోటల్ లో జరగనున్నాయి. డాన్ మేనల్లుడి వివాహం కావడంతో ఈ పెళ్లిపై ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఓ కన్నేసి ఉంచారు. వచ్చే బంధువుల గురించి ఆరా తీయనున్నారు. అలాగే దావూడ్ వ్యతిరేకులు కూడా ఆ పెళ్లిలో విధ్వంసం సృష్టించే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు పోలీసు అధికారులు. ఈ పెళ్లికి దావూద్ సోదరుడు ఇక్బాల్ కస్కర్ – అతని సోదరీమణులు జైతూన్ – ఫర్జానాలు వారి భర్తలతో కలిసి హాజరయ్యే అవకాశం ఉంది. పెళ్లి ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా జరిగిపోవాలని దావూద్ ఆదేశాలిచ్చాడట.
