Sunday, May 5, 2024
- Advertisement -

బాబుకు షాక్ ఇవ్వబోతున్న మంత్రి… త్వరలో కడప జిల్లాలో టీడీపీ ఖాలీ

- Advertisement -

ఏపీలో కమలం పార్టీ ఆపరేషన్ మూడు పువ్వులు …ఆరు కాయలుగా సాగుతోంది. చాపకింద నీరులా ఇతర పార్టీల నాయకులను చేర్చుకుంటూ బలోపేతం అవుతోంది. ప్రధానంగా టీడీపీ నేతలపైనె గురి పెట్టింది. ఇప్పటికే అనేక మంది ముఖ్య నాయులు కాషాయ కండువా కప్పుకున్నారు. టీడీపీ పై నమ్మకంలేని నేతలందరూ భాజాపాలోకి వెల్తున్నారు. అయినా కూడా బాబు వలసలను ఆపలేక సతమత మవుతున్నారు.

ఇక తాజాగా కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆదినారయణ రెడ్డి భాజాపాలో చేరేందుకు సిద్దం అయ్యింది. ఇదే జరిగితే టీడీపీకీ పెద్ద నష్టమే. ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడినప్పటినుంచి టీడీపీతో ఆయన అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన విస్తృత స్థాయి సమావేశానికి కూడా ఆయన హాజరుకాలేదు.

ఇటీవలె భాజాపా తీర్థం పుచ్చుకున్న బీజేపీ నేత, ఎంపీ సీఎం రమేష్ తో ఆదినారాయణరెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. మరో వైపు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డితో విబేధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంోల రమేష్ ద్వారానే బీజేపీలో చేరేందుకు పావులు కదుపుతున్నట్టు సమాచారం. ఇప్పటికే

ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆయన కడప ఎంపీగా పోటీ చేసి ఘోర ఓటమిని చవిచూశారు. జమ్మలమడుగు అసెంబ్లీకి పోటీ చెయ్యాలని భావించిన ఆదికి చంద్రబాబు మొండిచెయ్యి చూపారు. ఆయనను కాదని జమ్మలమడుగు టిక్కెట్ మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి ఇచ్చారు. దీంతో ఆయన అయిష్టంగానె ఎంపీగా పోటీ చేశారు. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం పత్తా లేకుండా పోయిన ఆది.. బీజేపీ నేతలతో చర్చలు జరుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

జేపీ నడ్డాను కలవడం ప్రాధాన్యతను సంతరించుకొంది. ఏపీ రాష్ట్రానికి చెందిన పలువురు టీడీపీ నేతలు బీజేపీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారని కమలదళం చెబుతుంది. ఇప్పటికే కొందరు నేతలు బీజేపీలో చేరారు. మరికొందరు నేతలు కూడ త్వరలోనే చేరే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ తరుణంలో జేపీ నడ్డాతో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సమావేశం కావడం రాజకీయంగా చర్చకు దారితీసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -