నటుడు, సినీ నిర్మాత బండ్ల గణేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యాపరవేత్త, నిర్మాత పీవీపీ, బండ్ల గణేష్ మధ్య జరిగిన వివాదం గురించి తెలిసిందే. ఓ సినిమా కారణంగా ఈ గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బండ్ల గణేష్ తన అనుచరులను పంపించి బెదించాడని అతని పై పీవీపీ కేసు పెట్టాడు. ఈ కేసుల మేరకు పరారీలో ఉన్న బండ్ల గణేష్ ను పోలీసులు విచరణకు పిలిచారు.
బండ్ల గణేష్ పై ఐపీసీ 420, 448, 506 r/w 43 ipc సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. ఈమేరకు బండ్ల గణేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక బండ్ల గణేష్ పై ఇలాంటి కేసులు, వివాదలు కొత్తేమి కాదు. నీజతగా నేనుండాలి సినిమా విషయంలో హీరో సచిన్ జోషికి, బండ్ల గణేష్ కు భేదాభిప్రాయాలు రావడం.. ఒకర్ని ఒకరు దూషించుకున్న విషయం తెలిసిందే. అలాగే టెంపర్ విషయంలో చెక్కు బౌన్స్ కేసు కూడా బండ్ల గణేష్ పై నమోదు అయిన విషయం తెలిసిందే.
మరో వైపు 2014 అక్టోబర్ 1న కడపకు చెందిన మహేశ్ అనే వ్యాపారి వద్ద గణేష్‌రూ.10 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఆ డబ్బు తిరిగి ఇవ్వలేదు. తర్వాత మూడు చెక్కులను ఇవ్వగా.. అవి 2017లో బౌన్స్ అయ్యాయి. కడప కోర్టులో ఈ కేసు కొనసాగుతోంది. కోర్టుకు గణేష్ హాజరు కాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంటు జారీ అయింది.
ఆయనను హాజరు పర్చాలంటూ బంజారాహిల్స్ పోలీసులను కోర్టు ఆదేశించింది. పీవీపీ కేసు విషయంలో జూబ్లీహిల్స్ స్టేషన్ కు గణేశ్ వచ్చినట్లు సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు అతన్ని అక్కడ అరెస్టు చేశారు. ఆయనను గురువారం కడప కోర్టులో హాజరు పరుస్తామని బంజారాహిల్స్ ఇన్ స్పెక్టర్ ఆర్ కళింగరావు తెలిపారు.
