ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ధురందర్’ సిరీస్ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఇప్పటికే విడుదలైన రెండు భాగాలు (‘ధురందర్’ మరియు ‘ధురందర్: ది రివెంజ్’) ప్రపంచవ్యాప్తంగా రూ. 3,000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారతీయ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులు నెలకొల్పింది.
ఇప్పుడు అందరి కళ్లు మూడవ భాగంపై పడ్డాయి. జియో స్టూడియోస్ నిర్మాత జ్యోతి దేశ్‌పాండే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ధురందర్’ ఫ్యాన్స్‌కు ఒక పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. మేము ‘ధురందర్’తో ఇంకా ముగించలేదు. ఈ ఏడాది చివర్లో ప్రేక్షకులకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం. మేము ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌పై పని చేస్తున్నాం అని ఆమె పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో ‘ధురందర్ 3’ అనౌన్స్‌మెంట్ రాబోతుందంటూ ప్రచారం జోరందుకుంది. ధురందర్ 3: హంజా అలీ మజారీ పాత్రలో రణవీర్ సింగ్ మరో మిషన్‌తో మూడవ భాగంలో కనిపిస్తారని టాక్ నడుస్తోంది. అయితే ఈ ఏడాది చివర్లో ఆదిత్య ధర్ మరియు రణవీర్ సింగ్ ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తారో వేచి చూడాల్సిందే!
