ఓటుకు నోటు వ్యవహారంలో ఇరుక్కొన్న రేవంత్ రెడ్డి శాసన సభ్యత్వంపై కూడా తెలుగుదేశం పార్టీకి డౌట్లు పుట్టుకొచ్చనట్టుగా ఉన్నాయి. ఈ వ్యవహారం ముదిరనున్నదని.. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే పదవిని కూడా కోల్పోతాడని తెలుగుదేశం పార్టీనే ఒక అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తోంది. అందుకే ఇప్పుడు ఆ పార్టీ రేవంత్ కు ప్రత్యామ్నాయాన్ని రెడీచేసుకొంటోంది. రేవంత్ భార్యను రంగంలోకి దించడానికి సిద్ధం అయ్యింది.
ఈ మేరకు రేవంత్ భార్య గీత కొడంగల్ నియోజకవర్గంపై దృష్టిసారించినట్టుగా తెలుస్తోంది. రేవంత్ కు అనుకూలమైన పరిస్థితి ఉన్న ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం నేతలను, రేవంత్ అనుచర గణాన్ని కలుపుకుపోవడానికి ఆమె ప్రయత్నించనున్నారని సమాచారం. ఈ విధంగా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చేసుకొంటోంది.
మరి ఒక దశలో తెలుగుదేశం పార్టీ తరపున తెలంగాణ కు ముఖ్యమంత్రి అభ్యర్థిని అవుతాను అనుకొనేంత వరకూ వెళ్లాడు రేవంత్ రెడ్డి. రాబోయే పాతికేళ్లూ తనవేనని ఆయన చెప్పుకొనే వాడు. అయితే ఇప్పుడు జరిగిన పరిణామాలు మాత్రం ఆయనను సైడ్ చేసేశాయి.. ఏకంగా ఆయనకు ప్రత్యామ్నాయంగా భార్యను రంగంలోకి దించాల్సిన పరిస్థితులు వచ్చానయనమాట!
