బిగ్ బాస్ 5 సీజన్ ఎప్పుడో తెలుసా?

- Advertisement -

తెలుగు లో బిగ్ బాస్ సీజన్ ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 1 కి ఎన్టీఆర్, సీజన్ 2 కి నాని.. సీజన్ 3,4 కి అక్కినేని నాగార్జున హూస్ట్ గా వ్యవహరించారు. బిగ్ బాస్ తెలుగు 4 ముగిసిన సంగతి తెలిసిందే. ఇక అందరి చూపు బిగ్ బాస్ 5 పైనే వుంది. ఇక బిగ్ బాస్ షో సీజన్ 5 ఈ ఏడాది జూన్ , జులై నెల నుంచి ప్రారంభం కానుందని సమాచారం అందుతుంది. సమ్మర్ లో ఐపీఎల్ మ్యాచ్ లు ఉన్నాయి.. ఈ సమయంలో బిగ్ బాస్ మొదలు పెడితో టీఆర్పీ రేటింగ్ పడిపోతుందని యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం.

ఇక ఐపీఎల్ మ్యాచ్ లు గత సీజన్లపై కొంత ప్రభావం చూపిన నేపథ్యంలో ఈ సీజన్ ఆలస్యంగా ప్రారంభం కానుండటం బిగ్ బాస్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్ గా ఉంది. ఐపీఎల్ మ్యాచ్ లు ప్రసారమైతే వీకెండ్ లో బిగ్ బాస్ షోకు మంచి టీఆర్పీ రేటింగ్ వచ్చినా వీక్ డేస్ లో రేటింగ్ తక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. దానికి తోడు ఈ సీజన్ లో సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న వారినే ఎక్కువగా తీసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది.

- Advertisement -

ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ సీజన్ 3,4లకు హోస్ట్ గా మెప్పించిన కింగ్ నాగార్జునని 5 కూడా హోస్ట్ గా ఫిక్స్ చేయడంతో పాటు 100 రోజులు ప్రసారం చేయాలని భావిస్తు న్నారట. ఇక సీజన్ 5 కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కావడంతో ఈ ఏడాది ఏప్రిల్ , మే లలో బిగ్ బాస్ షో ప్రారంభం కానున్నట్టు వినిపిస్తున్నా, ఐపియల్ వల్ల ఆలస్యం అయ్యే అవకాశం వుందంటున్నారు.

హీరో నితిన్ ‘చెక్’ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా?

కేసిఆర్ కి హై కోర్టు షాక్… కారణం అదేనా?

చారిత్రక ఇన్నింగ్స్​ ఆడిన యువ బ్యాట్స్​మన్ పృథ్వీ షా..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -