Saturday, May 4, 2024
- Advertisement -

‘అ.. ఆ..’ మూవీ రివ్యూ!

- Advertisement -

అత్తారింటికి దారేది , సన్ ఆఫ్ సత్యమూర్తి లాంటి హిట్ లతో ఫుల్ ఫార్మ్ లో ఉన్న డైరెక్టర్ త్రివిక్రమ్ మరొక పెద్ద హీరో తో కాకుండా సింపుల్ గా నితిన్ తో సినిమాకి సంతకం పెడితే అందరూ ఆశ్చర్యపోయారు.

సమంత ని హై లైట్ చేస్తూ అనసూయ రామలింగం vs ఆనంద్ విహారి గా ఈ సరికొత్త ప్రేమ కథ ని త్రివిక్రమ్ మన ముందరకి తీసుకురావడం విశేషం. జంధ్యాల తరవాత తెలుగు లో అంత పట్టున్న డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ ఈ సినిమా ని ఎలా హ్యాండిల్ చేసాడు అనేది చూద్దాం రండి ..

పాజిటివ్ లు:

లక్ష్మి – నదియా తన అన్న దగ్గర అప్పు తీసుకుని బిజినెస్ మొదలు పెట్టి కోట్లకి పడగలు ఎత్తుతుంది. కొన్నేళ్ళ తరవాత త అన్న కి ఇవ్వాల్సిన సొమ్ము తిరిగి ఇవ్వడం విషయం లో ఆమె ఆలస్యం చేస్తూ ఉండగా తన పొలం పోవడం తో లక్ష్మి అన్న ఆత్మహత్య చేసుకుంటాడు. ఆయన చావు తరవాత ఇద్దరి కుటుంబాల మధ్యా బంధుత్వం దారుణంగా తెగిపోతుంది. మళ్ళీ పాతికేళ్ళ తరవాత ఈ కుటుంబాలు రెండూ కలవడం కోసం నదియా కూతురు అయిన అనసూయ , నదియా అన్న కొడుకు అయిన ఆనంద్ ఏం చేసారు అనేది ఈ కథ . సినిమా ప్లాప్ చాలా సాదా సీదా ది తీసుకున్న త్రివిక్రమ్ ప్రేక్షకులని ఎక్కడా కన్ఫ్యూజ్ చెయ్యడానికి ప్రయత్నం చెయ్యలేదు . క్యారెక్టర్ లు పర్ఫెక్ట్ గా రాసుకుని వాటిల్లోంచి కామెడీ ని పుట్టించిన త్రివిక్రం నితిన్ రోల్ ని హై లైట్ చేస్తూనే సమంత కి కూడా తగిన ప్రాధాన్యం ఇస్తూ వచ్చాడు. ముందుగా అందరూ అనుకున్నట్టే ఇది సమంత మేజర్ రోల్ లో నడిచిన సినిమా అలాగని నితిన్ కి ఎక్కడా తక్కువ కానివ్వకుండా సాగానిచ్చాడు త్రివిక్రమ్. నదియా , నరేశ్ , అజయ్ , శ్రీనివాస్ రెడ్డి అందరూ తమ పరిధి లో చాలా బాగా చేసారు . రావు రమేష్ ఎప్పటి లాగానే ఈ సినిమాకి కూడా ప్లస్ పాయింట్ లాగా మారిపోయాడు. తనదైన విలనిజం, తనదైన కామెడీ తో కడుపుబ్బా నవ్వించడానికి ఉపయోగ పడ్డాడు.ముఖ్యంగా సినిమా అంతా అయిపొయింది అనుకున్నప్పుడు థియేటర్ లోంచి జనాలు వెళ్ళిపోతున్న సమయం లో రావు రమేష్ చేసిన కామెడీ అదుర్స్ అంతే . పాటల చిత్రీకరాణ  బాగుంది. సినిమాటోగ్రఫీ కి మంచి మార్కులు పడతాయి. కామెడీ శాతం ఎక్కువగా పెట్టి లాగించాడు సినిమా మొత్తం, అలాగని వల్గారిటీ కి అసలు చోటే లేదు. త్రివిక్రమ్ డైలాగుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు.

నెగెటివ్ లు:

సెకండ్ హాఫ్ లో చాలా సీన్ లు డ్రాగ్ అవడం అతిపెద్ద మైనస్ పాయింట్. ఫస్ట్ హాఫ్ లో కాస్త మంచి ప్లాట్ వేసి పెట్టి కడుపుబ్బా నవ్వించిన త్రివిక్రమ్ సెకండ్ హాఫ్ లో గతి పూర్తిగా తప్పిపోయాడు ( ఆఖరి 15 నిమిషాలు  దాన్ని కవర్ చెయ్యబట్టి సరిపోయింది ) . సమంత – నితిన్ ల మధ్యన కెమిస్ట్రీ అస్సలు వర్క్ అవ్వలేదు. ఇద్దరి మధ్యనా ప్రేమ పుట్టిన సన్నివేశాలు సరిగ్గానే తీసినా వారిద్దరి మధ్యనా ఆ ఫీల్ కనపడలేదు. ప్రేమ సన్నివేశం పండడం అనేది హీరో హీరోయిన్ ల మధ్య కెమిస్ట్రీ తో ముడి పడి ఉంటుంది, అందునా ప్రేమ కథతో సినిమా నడిచే అవకాశం ఉన్నప్పుడు ఆ ఛాన్స్ తీసుకోకూడదు డైరెక్టర్. ఇక్కడ అది బాగా లాగింగ్ అనిపించింది. స్క్రీన్ ప్లే లో చాలా లోపాలు కనిపించాయి

మొత్తం గా .. 

ఫామిలీ తో వారంతం లో వెళ్లి ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ నవ్వుకోగల సినిమా అ .. ఆ . సెకండ్ హాఫ్ లో చాలా డ్రాగ్ ఉన్నా ఆఖర్లో అది కవర్ అయ్యిపోయింది. సాధారణ కథని ఎంచుకుని కామెడీ తో , క్యారెక్టర్ ల నవ్యత తో , డైలాగ్ లతో సినిమాని నడిపించడం బహుసా ఈ తరం దర్శకులలో త్రివిక్రమ్ ఒక్కడికి మాత్రమే సాధ్యం ఏమో అనిపిస్తుంది ఈ సినిమా చూస్తే.

{youtube}v=0eXrpkIi_Ng{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -