- Advertisement -

ఇండిగో సిబ్బందిపై నరేష్ ఫైర్

- Advertisement -

ఇండిగో విమానయాన సంస్థ సిబ్బందితో నటుడు నరేష్‌కు సంబంధించిన వివాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. విమానం వద్దకు తీసుకెళ్లే బస్సులో ప్రయాణికులను అధిక సంఖ్యలో ఎక్కించడంతో నరేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే బస్సు నిండిపోయినా కూడా ఇంకా ప్రయాణికులను ఎక్కించడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. బస్సులో ప్రయాణికులను “పశువుల్లా కుక్కుతున్నారు” అంటూ నరేష్ మండిపడ్డారు.

ఈ ఘటనలో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నప్పటికీ, ఇండిగో సిబ్బంది ఎలాంటి స్పందన చూపలేదని ఆయన ఆరోపించారు. ప్రయాణికుల భద్రత, సౌకర్యాలపై కనీస శ్రద్ధ కూడా లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు ఇలాంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.

ఈ ఘటనపై నరేష్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా స్పందిస్తూ, ఇండిగో తీరును తీవ్రంగా ఖండించారు. ప్రయాణికుల హక్కులను కాలరాస్తున్న ఈ విధానంపై న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేశారు. అవసరమైతే ఇండిగోపై లీగల్ యాక్షన్ తీసుకుంటానని ఆయన ట్వీట్‌లో వెల్లడించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -