Tuesday, April 23, 2024
- Advertisement -

శివాజీ రాజాను క్ష‌మిస్తాడ‌ట‌..!

- Advertisement -

మూవీ ఆర్టిస్టు అధ్య‌క్ష ఎన్నిక‌ల‌లో న‌టుడు నరేశ్ విజ‌యం సాధించారు. ఆదివారం జ‌రిగిన ఎన్నిక‌ల‌లో త‌న తోటి న‌టుడు శివాజీ రాజాపై 68 ఓట్ల తేడాతో విజ‌యం సాధించారు. మొద‌టి నుంచి శివాజీ రాజా ఫ్యానెల్ గెలుస్తుంద‌ని అంద‌రు భావించారు. కాని అనుహ్యంగా న‌రేశ్ విజ‌యం సాధించారు. మా ఎన్నిక‌ల‌లో ఎప్పుడు లేని విధాంగా అత్య‌ధిక ఓట్లు పోల్ కావ‌డం విశేషం. విజ‌యం అనంత‌రం న‌రేశ్ మాట్లాడుతు..ఎన్నికల సందర్భంగా కొందరు చేసిన ఆరోపణలు మానసిక క్షోభకు గురి చేశాయని తెలిపారు. ఆ స‌మ‌యంలో చాలామంది నా ఆరోప‌ణ‌లు చేశార‌ని , అవి ఏమి నా మ‌న‌స్సులో పెట్టుకోవడం లేద‌ని మీడియా ఎదుట‌గా తెలిపారు న‌రేశ్‌. శివాజీ రాజా నేను మంచి మిత్రులం. మేమిద్ద‌రం క‌లిసి మాలో ఎన్నో సేవ‌లు చేశాం. శివాజీ రాజాను క్ష‌మిస్తాను,మ‌ళ్లీ మేం ఇద్ద‌రం క‌లిసి ప‌ని చేయ‌డానికి నాకు ఎటువంటి అభ్యంత‌రం లేద‌ని నరేశ్ చెప్పుకొచ్చారు.

జనరల్‌ సెక్రటరీగా జీవిత రాజశేఖర్‌, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా రాజశేఖర్‌లు విజ‌యం సాధించారు. న‌టి హేమ ఇండిపెండెంట్‌గా పోటీ చేసి కూడా విజ‌యం సాధించారు. ఆమె ఉపాధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేసి గెలుపొందారు. ఉపాధ్యక్షులుగా ఎస్వీ కృష్ణారెడ్డి, , కోశాధికారిగా రాజీవ్‌ కనకాల, జాయింట్‌ సెక్రటరీగా గౌతమ్‌రాజు, శివబాలాజీ విజ‌యం సాధించారు. అలీ, రవిప్రకాశ్‌, తనికెళ్ల భరణి, సాయికుమార్‌, ఉత్తేజ్‌, పృథ్వి, జాకీ, సురేశ్‌ కొండేటి, అనితా చౌదరి, అశోక్ కుమార్‌, సమీర్‌, ఏడిద శ్రీరామ్‌, రాజా రవీంద్ర, తనీష్‌, జయలక్ష్మి, కరాటి కల్యాణి, వేణుమాధవ్‌, పసునూరి శ్రీనివాస్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులుగా ఎన్నిక అయ్యారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -