న‌టిపై అత్యాచారం.. భ‌ర్త‌కు భార్య‌ న‌గ్న ఫోటోలు

- Advertisement -

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వ‌ర‌కు సినీ ఇండస్ట్రీలో మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న లైంగిక వేధింపులు గురించి ఉద్య‌మం ఉదృదంగా సాగిన సంగ‌తి తెలిసిందే. అవ‌కాశాల పేరిట ఆర్టిస్ట్‌లను వాడుకుంటున్నార‌ని ఆరోప‌ణ‌లు వినిపించాయి. దీనిపై కొందరు మ‌హిళ‌లు బ‌హిరంగంగానే త‌మ‌కు జ‌రిగిన వేధింపులు గురించి చెప్ప‌డం జ‌రిగింది. ఇంత జ‌రుగుతున్న మ‌రో న‌టిపై అత్యాచారం చేశాడు ఓ ఘ‌నుడు. అవ‌కాశం ఇప్పిస్తానని చెప్పి , లైంగికంగా వాడుకోవ‌డ‌మే కాకుండా , డ‌బ్బులు కూడా అడుగుతున్నాడు ఈ ప్ర‌బుధ్దుడు.

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..రవీంద్రనాథ్ ఘోష్ అనే వ్యక్తి క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా చిన్న రోల్స్ చేసుకుంటు ఆస్పత్రిలో పనిచేస్తోన్న వివాహితను పరిచయం చేసుకున్నాడు. ఆమె పెద్ద సినిమాల‌లో అవ‌కాశాలు ఇప్పిస్తాన‌ని మాయ మాట‌లు చెప్పి త‌న బుట్ట‌లో వేసుకున్నాడు.ఆడిషన్స్ ఉన్నాయని చెప్పి మధ్ ఐలండ్‌ కి తీసుకెళ్లాడు. తన కోరిక తీరిస్తేనే అవకాశాలను ఇప్పిస్తాను అని ఆమెపై అత్యచారం చేశాడు.ఆ స‌మ‌యంలో తీసిన న‌గ్న ఫోటోలు చూపించి మరికొన్ని సార్లు అత్యాచారం జరిపాడు. లైంగికంగా వాడుకోవ‌డ‌మే కాకుండా డ‌బ్బులు కూడా అడ‌గ‌డం మొద‌లుపెట్టాడు రవీంద్రనాథ్. లక్ష రూపాయలు కూడా డిమాండ్ చేశాడు.

ఇవ్వకుంటే నీ భర్తకు ఫొటోలు పంపుతాను అని బెదిరించాడు. స‌ద‌రు బాధితురాలు డ‌బ్బులు ఇస్తాను కాని ఇప్పుడు నా ద‌గ్గ‌ర లేవ‌ని చెప్ప‌డంతో, ఆమె న‌గ్న ఫోటోలు ఆమె భ‌ర్త‌కు పంపించాడు.. దీంతో ఆమెను భర్త వదిలేశాడు. త‌న‌కు జ‌రిగిన అన్యాయంపై పోలీసుల‌ను ఆశ్ర‌యించింది బాధితురాలు. ఈ కేసుపై ముంబై సెషన్ కోర్టు అత్యాచారం చేసిన వ్యక్తికి జీవిత ఖైదు విధించి ఒక లక్షా 31 వేలు జరిమానా ఇవ్వాలని చెప్పింది.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -