మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్ గురించి రోజుకో ఓ వార్త బయటికి వస్తోంది. ఇటీవల కాలంలో ఐశ్వర్య రాయ్ గురించి మీడియాలో వరుస కథనాలు వెలువడుతన్నాయి. ఈ వార్తల సారాంశం ఏమిటంటే ఐష్ మళ్లీ తల్లి కాబోతుందని వార్తలు వచ్చాయి. ఎనిమిదేళ్ల గ్యాప్ తర్వాత బచ్చన్ దంపతులు మరోసారి తల్లితండ్రులు కాబోతున్నారన్న వార్త విని ఇద్దరు అభిమానులు తెగ సంతోషించారు. అయితే ఈ వార్తలపై ఐష్ క్లారిటీ ఇచ్చింది. తాను తల్లి కాబోతున్నాన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చేశారు.
ఇటీవల ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయడానికి భర్త చ, కూతురుతో కలిసి గోవాకు వెళ్లింది. అక్కడ తీసిన ఫోటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో బాగా పాపులర్ అయింది. ఈ ఫోటోలో ఐష్ పొట్ట దగ్గర కాస్తా ఎత్తుగా కనిపించడంతో , ఆమె తల్లి కాబోతుందని ప్రచారం మొదలుపెట్టారు. అయితే ఈ వార్తల్లో నిజం లేదని చెప్పుకొచ్చింది ఐష్. అయితే ఐష్ , అభిషేక్‌కు పుట్టింది ఆరాధ్య. ఆ పాపకు ఇప్పుడు 8 సంవత్సరాలు. రెండో బిడ్డ కోసం ప్లానింగ్ చేయడం లేదా అంటూ ఐష్‌ను ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. మరి వారి ప్రశ్నకు ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి.
- Advertisement -
ప్రెగ్నెన్సీపై క్లారిటీ ఇచ్చిన ఐశ్వర్య రాయ్
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -
