- Advertisement -

చంద్రబాబు, పవన్‌లకు బన్నీ సాలిడ్ పంచ్…. దిమ్మతిరిగే విమర్శలతో మహేష్

- Advertisement -

నా అంత గొప్పోడో లేడని ప్రతిక్షణం చెప్పుకుంటూనే ఉంటాడు చంద్రబాబు. భజన బ్యాచ్ పొగడ్తలు సరిపోవన్నట్టు స్వోత్కర్షలతో కూడా రెచ్చిపోతూ ఉంటాడు బాబు. ఇక పవన్ కూడా ఇప్పుడు బాబు స్టైల్‌లోనే ముందుకు పోతున్నాడు. అన్నీ నా వళ్ళే అని చెప్పుకుంటూ ఉన్నాడు. అయితే మేమే అసలైన హీరోలం అని చెప్పుకోవడానికి తాపత్రయపడుతున్న చంద్రబాబు, పవన్‌ల వ్యక్తిత్వంలోని డొల్లతనాన్ని తాజాగా రిలీజ్ అయిన భరత్ అను నేను, నా పేరు సూర్య సినిమాల ట్రైలర్, టీజర్ వీడియోలు బయటపెట్టేస్తున్నాయి.

కెసీఆర్ తెలంగాణా అంటూ విద్వేష రాజకీయాలు చేస్తున్న సమయంలో చంద్రబాబు, పవన్‌లిద్దరూ కూడా దేశ సమగ్రత గురించి మాట్లాడినవాళ్ళే. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు మోడీకి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఆ వ్యతిరేకతను, ప్రజల ఆవేశాన్ని ఇంకాస్త రెచ్చగొట్టడం కోసం ఉత్తర-దక్షిణ భారతదేశాలు అంటూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు చంద్రబాబు, పవన్‌లు. ఈ విషయంలో భారతదేశాన్ని అభిమానించే అందరూ కూడా చంద్రబాబు, పవన్ వ్యాఖ్యల పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన నా పేరు సూర్య డైలాగ్ టీజర్‌లో ఇదే ఆవేదనను తన డైలాగ్‌లో చూపించాడు బన్నీ. ‘సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్……….అన్ని ఇండియాలు లేవురా…….ఉన్నది ఒక్కటే ఇండియా’ అని అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ ఇప్పుడు విశేషంగా ఆకట్టుకుంటోంది. స్వార్థ రాజకీయాల కోసం, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం చంద్రబాబు, పవన్‌లు చేస్తున్న దిగజారుడు రాజకీయాలను ప్రజలకు అర్థమయ్యేలా చేస్తోంది.

ఇక నాయకులందరినీ మాట మీద నిలబడిన మగాళ్ళుగా చేస్తా, మాట తప్పిన నాయకుడు మనిషే కాదు అంటూ భరత్ అను నేను సినిమా టీజర్, ట్రైలర్‌లో మహేష్ వినిపించిన డైలాగులు కూడా చంద్రబాబు, పవన్‌లకు సూటిగానే తగుల్తున్నాయి. 2014 ఎన్నికల్లో ఎన్నో హామీలిచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పూర్తిగా మాట తప్పాడు. ఇక ఎన్నికలయ్యాక చంద్రబాబు, మోడీలను కూడా ప్రశ్నిస్తా అని ప్రజలకు భరోసా ఇచ్చిన పవన్ కూడా నాలుగేళ్ళఫాటు పూర్తిగా సినిమాలకు పరిమితమై, తన స్వార్థ వ్యవహారాలు చూసుకుని ఇప్పుడు మళ్ళీ ఎన్నికల ఏడాది రాగానే యాక్టివ్ అయ్యాడు. అలా చంద్రబాబులాగానే తనకు కూడా విశ్వసనీయత లేకుండా చేసుకున్నాడు పవన్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -