- Advertisement -

దగ్గుబాటి కుటుంబానికి కోర్టులో చుక్కెదురు

- Advertisement -

దక్కన్ కిచెన్ హోటల్ కేసు విచారణ సందర్భంగా దగ్గుబాటి కుటుంబానికి న్యాయస్థానంలో చుక్కెదురు ఎదురైంది. కోర్టు ఆదేశాలను పదేపదే పాటించకపోవడంపై నాంపల్లి కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కోర్టుకు హాజరుకాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్లు (NBW) జారీ చేయాల్సి వస్తుందని న్యాయమూర్తి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.

ఈ కేసులో టాలీవుడ్ ప్రముఖ నటులు వెంకటేశ్, రానా, ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు, అలాగే అభిరామ్ తప్పనిసరిగా కోర్టు విచారణకు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇప్పటికే పలుమార్లు సమన్లు జారీ చేసినప్పటికీ, వారు కోర్టుకు రాకపోవడంపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఎన్నిసార్లు కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తారు?” అని ప్రశ్నిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

సాధారణ ప్రజలకు ఒక న్యాయం, సెలబ్రిటీలకు మరో న్యాయమా? అంటూ న్యాయస్థానం వ్యాఖ్యానించడం ఈ విచారణలో ప్రాధాన్యతను సంతరించుకుంది. చట్టం ముందు అందరూ సమానులేనని, పేరు, హోదా కారణంగా ఎవరికి ప్రత్యేక మినహాయింపులు ఉండవని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

కోర్టు ఆదేశాలను గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యత అని, ప్రముఖులైనా సరే న్యాయ ప్రక్రియకు లోబడాల్సిందేనని న్యాయస్థానం తేల్చి చెప్పింది. తదుపరి విచారణ తేదీన సంబంధిత వారంతా కోర్టుకు హాజరుకావాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని నాంపల్లి కోర్టు స్పష్టం చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -