- Advertisement -

గ్యాంబ్లింగ్ రాకెట్ కేసులో అల‌నాటి ప్ర‌ముఖ న‌టి భాగ్యశ్రీ భర్త అరెస్ట్

- Advertisement -

మేనే ప్యార్‌ కియా ( ప్రేమ పావురాలు) అనే తొలిచిత్రం తోనే భాగ్యశ్రీ బాగా పాపులయ్యారు. అంతేకాదు ఈ చిత్రంలో ఉత్తమ పరిచయ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ కూడా అందుకున్నారు. చిన్ననాటి స్నేహితుడు హిమాలయా దాసానితో వివాహం అనంతరం ఆమె చిత్ర సీమకు దూరంగా ఉన్నారు.ఇటీవల ఆమె కుమారుడు అభిమన్యు దాసాని ‘మర్ద్ కో దర్ద్ నహీ హోతా’ అనే సినిమాతో బాలీవుడ్ కి పరిచయమయ్యారు. మార్చిలో విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా భాగ్యశ్రీ భర్త హిమాలయ దాసానీని పోలీసులు అరెస్ట్ చేశారు. గాంబ్లింగ్ రాకెట్ కు సంబంధించిన ఆరోపణలతో వ్యాపారవేత్త అయిన హిమాలయను అంబోలీ పోలీసులు సోమవారం నాడు అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం ముంబైలోని అంబోలి పోలీసు అధికారుల సమాచారం మేరకు… హిమాలయను అతని నివాసంలో నిన్న అరెస్ట్ చేసి, స్థానికంగా ఉన్న ఓ కోర్టులో హాజరుపరిచారు. వెంటనే ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వ్యాపారవేత్త అయిన హిమాలయ సినీ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -