- Advertisement -

ప్రేమ పేరుతో మోసం..పాస్టర్‌పై కేసు

- Advertisement -

ప్రేమ, పెళ్లి పేరుతో ఓ మహిళా ప్రభుత్వ ఉద్యోగినిని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ‘లివింగ్ వే’ చర్చికి చెందిన పాస్టర్ జోసెఫ్ సందీప్ వడేగర్‌పై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ వ్యవహారం బయటపడింది.

బాధితురాలితో సన్నిహితంగా మెలిగి, ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి పాస్టర్ సందీప్ లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొంతకాలం తర్వాత పెళ్లి విషయమై ఒత్తిడి చేయగా, అతని అసలు స్వరూపం బయటపడినట్లు బాధితురాలు తెలిపింది.

ఇప్పటికే అతనికి మరో వివాహితతో సంబంధం ఉందని, ఆమెతో కలిసి దుబాయ్, గోవా వంటి ప్రాంతాలకు వెళ్లి విహరించాడని బాధితురాలు ఆరోపించింది. ఈ విషయం గురించి నిలదీయగా, చంపేస్తానని బెదిరించడమే కాకుండా, తనతో కొనసాగాలంటే ఆ మరో మహిళతో ఉన్న సంబంధాన్ని అంగీకరించాలని షరతు పెట్టినట్లు తెలిపింది.

మానసికంగా, ఆర్థికంగా వేధింపులకు గురైన బాధితురాలు చివరికి ఉప్పల్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -