కెరీర్ మొదట్లో కమెడియన్‌గా ఆకట్టుకున్న సునీల్ ‘మర్యాదరామన్న సినిమాతో హీరోగా మారాడు.హీరోగా రెండు,మూడు హిట్లు కొట్టిన సునీల్‌కు తరువాత వరస ప్లాప్‌లు పలకరించాయి.దీంతో అతడికి హీరోగా అవకాశాలు తగ్గాయి.దీంతో ఆయన మళ్లీ కమెడియన్‌గా రీ-ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవతున్నాడు.ఇక్కడ వరకు బాగానే ఉన్నప్పటికి తాను కమెడియన్‌గా చేసే సినిమాలలో కూడా కోటి రూపాయిలు రెమ్యునరేషన్ అడుగుతున్నాడుటా సునీల్!
సునీల్ రెమ్యునరేషన్ చూసి నిర్మాతలు షాక్ అవుతున్నారని సమాచారం.తాజాగా సునీల్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కితున్న అరవింద సమేత సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో సునీల్ ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ కావడంతో సునీల్ కోటి డిమాండ్ చేశాడని టాక్.అసలే హీరోగా అవకాశాలు లేక కమెడియన్‌గా ఎంట్రీ ఇస్తున్న సునీల్ అప్పుడే కోటి డిమాండ్ చేస్తే తరువాత తెలుగు తెర మీద సునీల్‌ను చూడటం కష్టమే అని చర్చించుకుంటున్నారు ఇండస్ట్రీలోని కొందరు.
