టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆఫీస్‌పై ఐటీ శాఖ దాడులు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది అల్లు అరవింద్ నిర్మించిన సినిమా గీతా గోవిందం. టాలీవుడ్ సన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ఈ సినిమాలో హీరోగా నటించాడు. హీరోయిన్‌గా రష్మిక నటించింది. 2018లో ఘన విజయం సాధించిన సినిమాలలో గీతా గోవిందం కూడా ఒకటి. సినిమా 100 కోట్ల క్లబ్‌లో కూడా చేరిందని చిత్ర నిర్మాత అల్లు అరవింద్ అధికారికంగా ప్రకటించారు.
ఇప్పుడు దీనికి సంబంధించే ఐటీ శాఖ అల్లు అరవింద్ ఆఫీస్ ఇంటిపై దాడులు నిర్వహించారని తెలుస్తోంది.130 కోట్ల వరకు వసూళ్లు ఉండడంతో పన్ను చెలింపుల విషయంలో సంస్థ అధినేతలను ఇతర కార్యాలయ సిబ్బందిని కూడా అధికారులు విచారించారు. సుమారు 2 గంటలకు పైగా ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అయితే అన్ని లెక్కలు పక్కాగా ఉండటంతో ఐటీ అధికారులు అల్లు అరవింద్ ఆఫీస్ నుంచి వెనుతిరిగారని తెలుస్తోంది.
- Advertisement -
అల్లు అరవింద్ ఆఫీస్‌పై ఐటీ దాడులు…కారణం విజయ్ దేవరకొండనేనా..?
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -
