- Advertisement -

1000 పేద కుటుంబాలకు గోపీచంద్ సాయం

- Advertisement -

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అలానే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పనులు లేక పేదలు ఆకలికి అల్లాడుతున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. పేదలు .. కార్మికుల విషయంలో టాలీవుడ్ సెలబ్రిటీలు స్పందిస్తున్న తీరు ప్రశంసలందుకుంటోంది. మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలోని సీసీసీ ఇండస్ట్రీ పేదలకు నిత్యావసరాల సాయం చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

కొన్ని నెలల పాటు కరోనా కల్లోలం నుంచి బయటపడే వరకూ ఈ సాయం అందనుందని సీసీసీ బృందాలు వెల్లడిస్తున్నాయి. పలువురు సినీ సెలబ్రిటీలు నిత్యావసర సరుకుల్ని పేదలకు పంచేందుకు ముందుకు రావడం మానవతను చాటుతోంది. హీరో గోపీచంద్ తనవంతు సాయమందించారు. 1000 పేద కుటుంబాలకు సహాయం చేసారాయన. అన్ని కుటుంబాలకు కిరాణా సామాగ్రిని దానమిచ్చారు. హైదరాబాద్ నందగిరి కొండల సమీపంలో పేదలకు బియ్యం.. పప్పు.. నూనెను ఒక నెలకు సరిపడా పంపిణీ చేశాడు. రోజువారీ కూలీలకు వేతన జీవులకు ఇది పెద్ద ఊరట అనే చెప్పాలి.

పలువురు పలు రకాలుగా సాయం చేస్తున్నారు. సీసీసీ ఫండ్ కి పెద్ద ఎత్తున విరాళాలు వచ్చాయి. సుమారు 7 కోట్ల మేర నిధి సమకూరిందని తెలుస్తోంది. దీనిని తెలుగు సినీకార్మికులకు వితరణ చేయాల్సి ఉంటుంది. నిత్యావసరాల కొరత లేకుండా ఆదుకోవాల్సి ఉంటుంది. ఇక గోపీచంద్ తరహాలోనే ఇంతకుముందు అల్లరి నరేష్ సహా పలువురు నవతరం హీరోలు తమవంతు సాయాన్ని అందించడం స్ఫూర్తి నింపింది. గోపీచంద్ ప్రస్తుతం సీటీమార్ అనే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సంపత్ నంది దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -