హైపర్ ఆది .. బెల్లితెర మీద ఈ పేరు పెద్ద సంచలనమే అని చెప్పాలి. ప్రముఖ ఈటీవీ ఛానెల్లో ప్రసారమయ్యే జబర్థస్త్ కామెడీ షో ద్వారా బాగా పాపులర్ అయ్యాడు హైపర్ ఆది. ఈ షోలో ఆది స్కీట్‌ల కోసం వెయిట్ చేసే వారు చాలామంది ఉన్నారు. ఆది స్కీట్‌లకు ,పంచ్‌లకు అభిమానులతో పాటు , షోలోని జడ్జీలు కూడా తెగ ఎంజాయ్ చేస్తారు. యూట్యూబ్‌లో ఆది స్కీట్‌లకు అత్యధిక వ్యూస్ రావడంతో,యూట్యూబ్ స్టార్‌గా నిలిచాడు ఆది.
మరి అలాంటి ఆది గత కొంతకాలంగా జబర్థస్త్‌లో కనిపించడం లేదు. అతను ఎందుకు జబర్థస్త్‌లో కనిపించడం లేదనే ప్రశ్నలు మొదలైయ్యాయి. ఆదికి యాక్సిడెంట్ అయిందని, లేదు సినిమాలు చేయడం వల్లనే షోకి రావడం లేదని ఇలా కొన్నిగాసిప్స్ వినిపించాయి. అయితే తాను ఎందుకు జబర్థస్త్‌కు రావడం లేదో ఒక వీడియోను విడుదల చేశాడు ఆది. అఖిల్ హీరోగా తెరకెక్కిన మిస్టర్ మజ్ను సినిమాలో అఖిల్‌కు ఫ్రెండ్‌గా నటించడం వల్లే తాను జబర్థస్త్‌కు దూరం అయ్యానని చెప్పుకొచ్చాడు. సినిమా పూర్తి కాగానే తిరిగి జబర్థస్త్ షోలో పాల్గొంటానని తెలిపాడు ఆది. చెప్పినట్లుగానే ఆది తిరిగి జబర్థస్త్‌కు వస్తున్నట్లు లేటెస్ట్ ప్రొమో చూస్తే తెలిసిపోతుంది.
తాజాగా విడుదల చేసిన జబర్థస్త్ ప్రొమోలో హైపర్ ఆది ఎంట్రీ ఇచ్చినట్లు చూపించారు. రావడం రావడంతోనే జబర్థస్త్ జడ్జీ, ఎమ్మెల్యే రోజాపై పంచ్‌లు వేశాడు ఆది. రోజాని ఆంటీ అని పిలిచి అందరిని ఆశ్చర్యపరిచాడు. తరువాత రోజాతో కలిసి డ్యాన్స్ స్టెప్‌లు వేసి స్టేజీ మొత్తాన్ని ఓ ఊపు ఊపాడు. తరువాత యాంకర్ అనసూయ చెల్లెలని కూడా తెర మీద చూపించి జబర్థస్త్‌లో తన విలువ ఏంటో మరోసారి నిరుపించుకున్నాడు ఆది.
- Advertisement -
రోజాని ఆంటీ అని పిలిచిన హైపర్ ఆది
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -
