Sunday, May 12, 2024
- Advertisement -

‘జై లవకుశ’ సినిమా రివ్యూ

- Advertisement -

వరస సూపర్ హిట్ సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఆయన తాజాగా నటించిన సినిమా జై లవ కుశ. ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రలో కనిపించారు. కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. బాబీ దర్శకత్వం వహించారు. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా సెప్టెంబర్21న ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం..

కథ :

కవల సోదరులు జై, లవకుమార్, కుశలు( ముగ్గురు ఎన్టీఆర్‍లు). అయితే జై కి నత్తి ఉండటంతో.. లవ, కుశ అతని చిన్న చూపు చూస్తారు. దాంతో లవ, కుశ చిన్నప్పుడే కోపం పెంచుకొంటాడు జై. అయితే అనుకోకుండా చిన్నప్పుడే ముగ్గురు అన్నదమ్ములు తప్పిపోతారు. లవ పెద్దయ్యాక బ్యాంకు ఉద్యోగిగా స్థిరపడతాడు. ఇక కుశ మాయలు చేసుకుంటూ.. అమెరికా వెళ్లి అక్కడే సెటిలవ్వాలని కలలుగంటాడు. అనుకోకుండా వీరిద్దరి జీవితాల్లోకి జై ప్రవేశిస్తాడు. లవకుమార్, కుశలపై వున్న చిన్నప్పటి పగనీ, ప్రతీకారాన్నీ జై ఎలా తీర్చుకొన్నాడు? తన ఎదుగుదలకు వీళ్లిద్దరిని జై ఎలా వాడుకొన్నాడు? చివరికి ఏం జరిగింది అనేది తెలుసుకోవాలంటే.. సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఈ మూవీలో కూడా ఎన్టీఆర్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. జై, లవ , కుశ ఇలా మూడూ పాత్రలో వేరియేషన్స్ చూపించాడు. లవ తో మంచితనం.. కుశతో తుంటరిగా.. ఇక జై క్యారెక్టర్ మాత్రం సూపర్. జై పాత్రలో ఎన్టీఆర్ అదరగొట్టేసాడు. నత్తితో మాట్లాడుతూనే ఎక్కడ విలనిజం తగ్గకుండా బాగా చేసాడు. లవ, కుశ కంటే.. జై క్యారెక్టర్ చాలా డిఫికల్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా నటుడిగా ఎన్టీఆర్ ను మరో మెట్టుకి ఎదిగేలా చేసిందని చెప్పుకోవాలి. ఇక హీరోయిన్స్ గా చేసిన.. రాశిఖన్నా, నివేదా థామస్ లు వారి పాత్రలకు తగిన న్యాయం చేశారు. ఇద్దరి పాత్రలు చాలా బాగున్నాయి. ఎన్టీఆర్ తో వీరి కెమిస్ట్రీ బాగుంది. సాయి కుమార్, బ్రహ్మాజీ, ప్రవీణ్… వీరు వారి వారి పాత్రలలో బాగా చేశారు. ఇక సినిమా విషంకు వస్తే.. ముగ్గురు అన్నదమ్ముల కథ. స్క్రీన్ ప్లే చాలా బాగుంది. ఎంటర్ టైన్మెంట్ చూపిస్తూనే.. ఎమోషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ అద్భుతంగా చూపించారు. ఫస్ట్ హాఫ్ ఎంటర్ టైన్మెంట్ తో కొనసాగగా… అసలు కథ సెకండ్ హాఫ్ లో మొదలవుతుంది. మూడు పాత్రల్లో తారక్ చేసే సందడి వెండితెరపై కన్నుల పండుగగా అనిపిస్తోంది. తారక్ ను మూడు విభిన్న పాత్రలలో, అందంగా చూపించిన సినిమాటోగ్రాఫర్ ఛోటా.కె.నాయుడు సినిమాటోగ్రఫీ అద్భుతం. ఇక రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన పాటలు విజువల్స్ గా చూసుకుంటే మరింత బాగున్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాను మరో లెవల్ కి తీసుకెళ్లింది. డైలాగ్స్ సూపర్బ్. ఎడిటింగ్ పర్వాలేదు. ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోతో ‘జై లవకుశ’ వంటి పెద్ద చిత్రం చేయడంతోనే బాబీ సక్సెస్ అయ్యాడని చెప్పుకోవాలి. తను అనుకున్న కథను అద్భుతంగా చూపించగలిగాడు. కళ్యాణ్ రామ్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ విషయంకు వస్తే.. కథ.. ఇలాంటి కథలు చాలానే వచ్చాయి. ఇక అక్కడ అక్కడ స్లో నేరేషన్ కమిపించింది. అలానే కామెడీ సీన్స్ కావాలని పెట్టినట్లు అనిపించింది.

మొత్తంగా :

ఈ దసరాకి.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగా.. చేసుకునే సినిమా జై లవ కుశ. ఫ్యామిలీతో వెళ్లి సరదాగా ఈ సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. ఎన్టీఆర్ తన నటవిశ్వరూపం చూపించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -