- Advertisement -

కిల్లర్ టీజర్ చూశారా!

- Advertisement -

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కిల్లర్’ ఇప్పటికే టీజర్‌తో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్లపై పూర్వాజ్, పద్మనాభ రెడ్డి నిర్మాణంలో, సుకు పూర్వాజ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.

తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే ఇది సాధారణ థ్రిల్లర్ కాదని, సస్పెన్స్‌తో పాటు టెక్నాలజీ, దేశభక్తి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంశాలను మేళవించిన సై-ఫై థ్రిల్లర్ అని అర్థమవుతోంది. సీరియల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న జ్యోతి పూర్వజ్ ఈ చిత్రంలో విభిన్నమైన పాత్రల్లో మెప్పించనుందని టీజర్ స్పష్టం చేసింది.

టీజర్ లాంచ్ కార్యక్రమంలో జ్యోతి మాట్లాడుతూ, రొటీన్ పాత్రల నుంచి బయటపడాలనుకున్న సమయంలో దర్శకుడు సుకు పూర్వాజ్ తనలోని కొత్త కోణాన్ని బయటపెట్టారని చెప్పారు. ఈ చిత్రంలో ఐదారు విభిన్న పాత్రలు పోషించే అవకాశం రావడం ఆనందంగా ఉందని, విజయశాంతి తరహా యాక్షన్ చేయాలన్న తన కల నెరవేరిందని తెలిపారు.

దర్శకుడు సుకు పూర్వాజ్ మాట్లాడుతూ, ఐదేళ్ల క్రితం రూపుదిద్దుకున్న కథ ఇదని, టీజర్‌లో కేవలం 40 శాతం మాత్రమే చూపించామని అన్నారు. ఎమోషనల్ డ్రామా, బ్రదర్-సిస్టర్ బాండింగ్, రివెంజ్, సబ్‌కాన్షియస్ ఐడెంటిటీ వంటి అంశాలతో సినిమా ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందని వెల్లడించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -