- Advertisement -

ఓటీటీలోకి కింగ్‌డమ్‌!

- Advertisement -

విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి కాంబోలో వచ్చిన కింగ్‌డమ్‌. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. విడుదలైన తర్వాత మాస్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో ఈ చిత్రం విఫలమైంది.

జూలై 30న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, మొదట పాజిటివ్ రివ్యూలు తెచ్చుకున్నప్పటికీ భారీ బ్లాక్‌బస్టర్ అవ్వలేకపోయింది. దీంతో సీక్వెల్‌పై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికే ‘కింగ్డమ్’ డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుంది. ఆగస్ట్ 27 నుంచి ఈ చిత్రం ఓటీటీలో ప్రసారం కానుంది. తెలుగు తో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది. బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధించకపోయినా, విజయ్ దేవరకొండ, సత్యదేవ్ నటనలకు మంచి ప్రశంసలు లభించాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -