లైగర్ దెబ్బకు హడలిపోతున్న బాలీవుడ్ ?

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ” లైగర్ “. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై ఇండియా మొత్తంలో భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా చిత్రంగా రూపొందిన ఈ మూవీ ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో నార్త్ ఆడియన్స్ కు మరింత దగ్గరయ్యేందుకు విజయ్ ప్రమోషన్స్ లో వేగం పెంచారు. ఈ మద్య విజయ్ ఎక్కడికి వెళ్ళిన నార్త్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ కనబడుతోంది. అక్కడి స్టార్ హీరోలను తలపించేలా విజయ్ మ్యానియా కొనసాగుతుండడంతో బాలీవుడ్ సినివర్గం మొత్తం నివ్వెరపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఈ మద్య కాలంలో వరుసగా తెలుగు సినిమాలు బాలీవుడ్ లో అక్కడి స్టార్ హీరోలను సైతం తలదన్నే రీతిలో కలెక్షన్స్ రాబడుతున్నాయి. బాహుబలి తరువాత ఆ మద్య రిలీజ్ అయిన ” పుష్ప ” ఏ స్థాయిలో సంచలనలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ” పుష్ప ” మూవీ రికార్డ్ స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ఇక ” లైగర్ ” విషయానికొస్తే.. ఈ మూవీపై నార్త్ ఆడియన్స్ లో విపరీతమైన బజ్ ఉంది. దాంతో ఒకవేళ ” లైగర్ ” హిట్ టాక్ సొంతం చేసుకుంటే బాలీవుడ్ రికార్డ్ లను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇక ఈ మద్య రిలీజ్ అయిన అమీర్ ఖాన్ ” లాల్ సింగ్ చద్దా ” , అక్షయ్ కుమార్ ” రక్షా బంధన్ ” వంటి సినిమాలు కూడా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్స్ గా మిగిలాయి. ఈ నేపథ్యంలో ” లైగర్ ” మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంటే.. బాలీవుడ్ హీరోలను నార్త్ ఆడియన్స్ టోటల్ గా పక్కన పెట్టేసే పరిస్థితి ఏర్పడిన ఆశ్చర్యం లేదు. దాంతో ప్రస్తుతం విజయ్ కి నార్త్ లో ఏర్పడిన క్రేజ్ చూస్తుంటే నార్త్ హీరోలు హడలిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Also Read

సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో మహేష్.. మొదటిసారి ఉరమాస్ లుక్ ?

సలార్ పోస్టర్ రిలీజ్.. నిరాశలో ఫ్యాన్స్ !

రాజమౌళి టార్చర్ కు మహేష్ సిద్దమయ్యాడా ?

Related Articles

Most Populer

Recent Posts