తెలుగు పరిశ్రమలో ఫెడ్అవుట్ అయిన హీరోయిన్లు తమ కామెంట్స్‌తో వార్తల్లో నిలుస్తున్నారు.అసలు వారల్లో నిలవడానికే వాళ్లు ఇలాంటి వాఖ్యలు చేస్తున్నారు.శ్రీరెడ్డి,మాదవీలత లాంటీవాళ్లు దీనికిందకే వస్తారు. మాదవీలత రూటు మార్చినట్లుంది, మొన్న పవన్ కల్యాణ్‌ని దేవుడని చెప్పి,ఇండస్ట్రీలో లైగింక వేధింపులు గురించి చెప్పకొచ్చింది.ఇప్పుడు తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది.ఈసారి ఎన్టీఆర్‌పై తన మనస్సులోని మాటలను బయటపెట్టింది.
వచ్చే ఏడాది ఎన్నికల్లో జూనియర్ TDP తరపున.ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీలో ఉండాలనే అభిప్రాయం వెల్లడించింది. ‘‘జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలో ఉండాలి. ఎంత మంచి మాటకారితనం. మాటలు మాట్లాడటం స్టార్ట్ చేస్తే ఆగడు. కానీ, ఎందుకు ఆయన్ను పక్కన పెట్టారు??? రాజకీయాల్లో యువత చాలా అవసరం. గత ఎన్నికలప్పుడు కూడా అనుకున్నా ఎన్టీఆర్ కంటిన్యూ అవుతారని. ఏమైందో ఏమో! జనాలకి మంచి చేయాలి అనే ఆలోచన తాతగారి నుండి నేర్చుకునే ఉంటాడు’’ అని తెలిపింది.పవన్ ,ఎన్టీఆర్ అయ్యారు తరువాత ఎవరు అని సోషట్ మీడియాలో ఈమెను ట్రోల్ చేస్తున్నవారి సంఖ్య పెరిగిపోతుంది.
