Tuesday, April 30, 2024
- Advertisement -

అత్యున్నత న్యాయస్ధానం తీర్పును గౌరవించండి

- Advertisement -

వీధుల్లో పడి అడుక్కోవడం కంటే బార్లలో డాన్సులు చేయడంలో తప్పు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. డాన్స్ బార్లకు లైసెన్సులు ఇవ్వకుండా అడ్డంకులు కల్పిస్తున్న మహారాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీం కోర్టు మండిపడింది.

దీంతో పాటు విద్యా సంస్ధలకు కిలోమీటరు దూరంలో డాన్స్ బార్లు తెరవడంపై మహారాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నిబంధనలను సైతం సుప్రీంకోర్టు విమర్శించింది. డాన్స్ అనేది ఒక వృత్తి అని, అందులో అసభ్యత ఉంటే చట్టబద్దమైన హక్కు కోల్పోతుందే తప్ప ప్రభుత్వం దానిపై నిషేధం విధించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది.

అంతే కాకుండా అత్యున్నత న్యాయస్ధానం ఇస్తున్న ఉత్తర్వులను ఉల్లంఘించరాదని కూడా సుప్రీం హెచ్చరించింది. వీధులలో అడుక్కోవడం, ఆమోదయోగ్యం కాని పనులు చేయడం కంటే బార్లలో డాన్సు చేయడం ఎంతో మేలని అభిప్రాయపడింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -