టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఎప్పటికప్పడు తన మంచి మనస్సుని చాటుకుంటునే ఉన్నారు.చిన్న పిల్లల ఆపరేషన్‌కు తన వంతు సాయం చేస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఇటు తెలంగాణ,అటు ఏపీలో రెండు గ్రామాలను దత్తత తీసుకుని వాటిని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నాడు.తాజాగా మరోసారి తన అభిమానుల కోరిక తీర్చాడు మహేశ్.రాజమహేంద్రవరానికిచెందిన రేలంగి సత్యవతి అనే బామ్మ మహేష్ బాబు అభిమాని. అతడిని చూడడానికి ఆమె హైదరాబాద్ కి వచ్చారట. ఈ విషయాన్ని వెల్లడిస్తూ మహేష్ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ఫోటోని పంచుకున్నారు. ”ఎన్నేళ్లు గడుస్తున్నా నాపై ఉన్న ప్రేమ ఎక్కువవ్వడం చూస్తుంటే ఆనందంగా అనిపిస్తుంది.
అభిమానులు నాపై చూపే ప్రేమ, అభిమానం నాకెప్పుడూ సంతోషాన్ని కలిగిస్తాయి. 106 ఏళ్ల ఈ బామ్మ నాకోసం రాజమహేంద్రవరం నుండి నన్ను కలవడానికి వచ్చి ఆమె దీవెనలు నాకు అందించడం ఆనందాన్ని కలిగించింది. ఆమె తన అభిమానంతో నా మనసు గెలుచుకున్నారు. నిజం చెప్పాలంటే నన్ను కలిసినందుకు ఆమె కంటే నేనే ఎక్కువగా సంతోషపడుతున్నాను. దేవుడు దీవెనలు ఆమెపై ఉండాలి” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం మహేష్ బాబు.. వంశీపైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమాలో నటిస్తున్నాడు.
