Thursday, March 28, 2024
- Advertisement -

ఉదయ్ కిరణ్ బ్రతికుంటే లెక్కవేరే ఉండేది..

- Advertisement -

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి.. శిఖరం లాంటి బ్యాగ్రౌండ్ ఉన్న హీరోలకు కూడా దడ పుట్టించాడు హీరో ఉదయ్ కిరణ్. ’చిత్రం’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఉదయ్‌ కిరణ్ చాలా తక్కువ సమయంలోనే లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. వరుస హిట్లతో ఓ సమయంలో అగ్ర హీరోలకు సైతం షాకిచ్చాడు. ‘చిత్రం’ ‘నువ్వు నేను’, ‘మనసంతా నువ్వే’ సినిమాలతో హ్యాట్రిక్ పూర్తిచేశాడు. అప్పట్లో ఈయన ఫాలోయింగ్ చూసి స్టార్ హీరోల వారసులు కూడా వణికిపోయారు. అయితే అవకాశాలు తగ్గడంతో డిప్రెషన్‌కు గురైన ఆయన ఆత్మహత్య చేసుకుని యావత్ సినీ ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తాడు. కొందరు కావాలనే ఉదయ్ కెరీర్‌ను నాశనం చేసారని ఇండస్ట్రీలో టాక్.

ఇదంతా ఇలా ఉంటే తాజాగా ఉదయ్ కిరణ్ గురించి మరోసారి టాపిక్ మొదలైంది. ఈయనతో రెండు సినిమాలు చేసిన దర్శకుడు విఎన్ ఆదిత్య ఈ మధ్యే కొన్ని యూ ట్యూబ్ ఛానెల్స్‌కు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అందులో ఉదయ్ కిరణ్ గురించి మాట్లాడుతూ.. ఉదయ్ ఇప్పుడు బ్రతికుంటే ఆయన మార్కెట్ విలువ రూ.400కోట్లు ఉండేదని చెప్పారు.వీఎన్ ఆదిత్య దర్శకత్వంలో ఉదయ్ కిరణ్‌ మనసంతా నువ్వే, శ్రీరామ్ సినిమాలు చేసిన సంగతి తెలిసిందే . అందులో మనసంతా నువ్వే 2 కోట్లతో చేస్తే 16 కోట్ల షేర్ వసూలు చేసింది. శ్రీరామ్ యావరేజ్‌గా ఆడింది. కానీ నిర్మాతకు మాత్రం లాభాలు భారీగానే వచ్చాయట.

‘హీరోగా ఎంట్రీ ఇచ్చిన వెంటనే వరుసగా మూడు సూపర్ హిట్లు సొంతం చేసుకున్నాడు ఉదయ్. ఇప్పుడు గానీ అలా జరిగుంటే ఆయన మార్కెట్ రూ.400కోట్లకు చేరేది. ‘నువ్వు నేను’ సినిమా కోటిన్నరతో తీస్తే రూ.14 కోట్లు షేర్ వసూలు చేసింది. అలాగే ‘మనసంతా నువ్వే’ సినిమాకు రూ.2 కోట్ల బడ్జెట్‌తో తీస్తే రూ.16 కోట్ల షేర్ తీసుకొచ్చింది. అప్పట్లో ఉదయ్‌ కిరణ్ రేంజ్ అలా ఉండేది. అలాంటి స్టార్ ఇప్పుడు ఉంటే ఇండస్ట్రీలో పరిస్థితి వేరేలా ఉండేది. అయితే ఉదయ్ కిరణ్ అంత చిన్న వయసులో ఈ లోకాన్ని వీడి వెళ్లిపోవడం నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఏదేమైనా కూడా ఇండస్ట్రీ ఓ అద్భుతమైన నటుడిని కోల్పోయింది‘అని దర్శకుడు వీఎన్ ఆదిత్య బాధపడ్డాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -