హీరోయిన్ మెహ్రీన్ ఈ మధ్య సినిమాల కన్నా వివాదలతోనే ఎక్కువ వార్తల్లో నిలుస్తుంది. తన పారితోషకం విషయంలో వార్తల్లో నిలిచిన ఆమె మరో వివాదంలో ఇరుక్కుంది.సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్‌గా మెహ్రీన్‌ను ఎంపిక చేశారు. నిర్మాతలతో గొడవ కారణంగా సుధీర్ బాబు ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు.దీంతో ఈ సినిమాలో చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్‌ను హీరోగా తీసుకున్నారు.
కల్యాణ్ దేవ్ పక్కన అయితే సినిమా చేయనని చెప్పిందట మెహ్రీన్.దీంతో నిర్మాతలు ఇచ్చిన అడ్వాన్స్ ఇవ్వమని అడిగారు.దానికి మెహ్రీన్ అంగీకరించకపోవడంతో ఇప్పుడు ఈ గొడవ కాస్త ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, మూవీ ఆర్టిస్ట్అసోసియేషన్ కి చేరింది. తన కాల్షీట్ లను వృధా చేశారని, రెండు పెద్ద సినిమాల ఛాన్స్ లు పోయాయని మెహ్రీన్ గొడవ చేస్తుందట. అటు నిర్మాత కూడా తన అడ్వాన్స్ ఇవ్వాల్సిందేనని పట్టుపడుతున్నాడట.మరి ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్తూందో చూడాలి.
- యువతపై కేసులా? చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం!
- బిగ్‌బాష్ లీగ్ పై ఐపీఎల్ ఓనర్ల కన్ను!
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై చర్యలకు రంగం సిద్ధం!
- భార్యను హతమార్చి, తలను ఫ్రిడ్జ్‌లో పెట్టి..
- ప్రముఖ యూట్యూబర్ నందన అరెస్ట్!
