నా భర్తకు ఈ లక్షణాలు ఉండాలి : రష్మిక మందన్నా

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో లక్కీ హీరోయిన్ ఎవరంటే వెంటనే గుర్తుకు వస్తుంది రష్మిక మందన్నా. కన్నడంలో కిర్రాక్ పార్టీతో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. తెలుగు లో నాగశౌర్య సరసన ‘ఛలో’ చిత్రంతో తెలుగు లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత గీతాగోవిందం తో స్టార్ హీరోయిన్ క్రేజ్ దక్కించుకుంది. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరిక్షించుకోబోతుంది. హిందీలో ‘మిషన్ మజ్ను’ సినిమాతో పాటు అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి గుడ్ బాయ్ అనే సినిమాలో నటిస్తుంది.

సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటోంది. తాజాగా తన అభిమానులతో ఆమె సోషల్ మీడియా వేదిక ద్వారా కాసేపు ముచ్చటించింది. ‘మీరు స్మోక్‌ చేస్తారా?’ అని ఓ నెటిజన్‌ అడిగితే, ”నేనా.. స్మోకింగా? నాకు స్మోకింగ్‌ అంటే అసహ్యం. స్మోక్‌ చేస్తున్న వారి పక్కన నిలబడాలన్నా నాకు ఇష్టం ఉండదు’అని చెప్పింది.

మరో అభిమాని ‘నన్ను పెళ్లి చేసుకోండి’అని అడగ్గా.. కనీసం ప్రపోజల్‌ అయినా మంచిగా చెయ్యొచ్చు చమత్కారంగా సమాధానం ఇచ్చింది. మీ భర్త ఎలా ఉండాలనే ప్రశ్నకు సమాధానంగా… మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అయి ఉండాలని రష్మిక చెప్పింది. హంగులు, ఆర్భాటాలు లేకుండా ఒక సాధారణ వ్యక్తిగా కనిపించాలని తెలిపింది.

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -