బర్త్ డే: పూజ హెగ్డే ‘రాధే శ్యామ్’ పోస్టర్..!

- Advertisement -

నేషనల్ స్టార్ ప్రభాస్ పూజా హెగ్డే నటిస్తున్న సినిమా రాధే శ్యామ్. టి-సిరీస్ మరియు యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఓ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతుంది. ఈ సినిమాకు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించాడు. విదేశీ నేపథ్యంలో .. పునర్జన్మల చుట్టూ అల్లుకున్న ఈ కథను అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించారు.

ఈ రోజున పూజ హెగ్డే పుట్టినరోజు కావడంతో పోస్టర్ రిలీజ్ చేసారు చిత్ర బృందం. ఈ పోస్టర్ లో పూజ గ్రాండియర్ లుక్ తో కనిపిస్తోంది. ఆమె నాజూకుతనాన్ని ఈ పోస్టర్ అందంగా ఆవిష్కరించింది. ప్రేరణ పాత్ర తన కెరియర్లోనే ప్రత్యేకమైనదని పూజ చెబుతుండటం విశేషం.

తాజా అప్డేట్ ప్రకారం డిసెంబర్ నుంచి ఈ సినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టి సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు సమాచారం. సీనియర్ బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ ఒక కీలకమైన పాత్రను పోషించగా, మరో ముఖ్యమైన పాత్రలో కృష్ణంరాజు కనిపించనున్నారు.

మన హీరోలు వాడే కార్లు వాటి ఖరీదు ఎంతంటే ?

సమంత మొదటి లవ్ బ్రేకప్ స్టోరీ..!

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -