- Advertisement -

ఆ సినిమా చేసి త‌ప్పు చేశాను – పూజా హెగ్డె

- Advertisement -

ప్ర‌స్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవ‌రంటే అంద‌రు పూజా హెగ్డె పేరే చెబుతారు. కెరీర్ స్టార్టింగ్‌లో పెద్ద‌గా ఆక‌ట్టుకోని పూజా హెగ్డె , ఇప్పుడు వ‌రుస ఆఫ‌ర్ల‌తో దూసుకుపోతోంది. తాజాగా ఈ భామ త‌న కెరీర్‌పై తీవ్ర ప్ర‌భావం చూపించిన సినిమా గురించి చెప్పుకొచ్చింది. తెలుగులో వ‌రుస అవ‌కాశాలు వ‌స్తున్న త‌రుణంలో బాలీవుడ్ మీద మోజుతో హృతిక్ రోష‌న్ న‌టిస్తున్న ‘మొహంజదారో’ సినిమాలో ఆఫ‌ర్ రాగానే అక్క‌డికి చెక్కేసింది. ఈ సినిమా పూర్తి అయి విడుద‌ల కావడానికి మూడు సంవ‌త్స‌రాలు ప‌ట్టింది.

పూజా హెగ్డె ఈ సినిమాపై ఎన్నో అంచ‌నాలు పెట్టుకుంది. తీరా సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద అట్ట‌ర్ ఫ్లాప్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమాపై స్పందించింది పూజా హెగ్డె. ఓ న‌టి కెరీర్‌లో మూడు సంవ‌త్సరాలు చాలా కీల‌క‌మైన‌వి. కాని నేను రెండు సంవ‌త్స‌రాలు ఒక్క సినిమాకే కాల్ షీట్స్‌ను కేటాయించి త‌ప్పు చేశాను. తీరా సినిమా ఫ‌లితం కూడా న‌న్ను బాధించింద‌ని చెప్పుకొచ్చింది. ఈ సినిమా ఫ‌లితం త‌రువాత ‘మొహంజదారో’ సినిమా చేసి త‌ప్పు చేశాన‌ని ఫిలింగ్ క‌లిగింది.

ప్ర‌స్తుతం సినిమాల విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం లేదని తెలిపింది. తెలుగులో అల్లు అర్జున్‌తో క‌లిసి డీజే సినిమాతో తిరిగి రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో బికినిలో అందాల‌తో అంద‌రిని ఆక‌ట్టుకుంది. పూజా హెగ్డె ప్ర‌స్తుతం మ‌హేశ్‌తో క‌లిసి మ‌హర్షి సినిమాలో న‌టిస్తుంది. ఈ సినిమాతో పాటు ప్ర‌భాస్ కొత్త సినిమాలో కూడా పూజా హెగ్డె హీరోయిన్‌గా న‌టిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -